Site icon NTV Telugu

Kishan Reddy: హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లేదు..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశముందని తెలిపారు. గతంలో కూడా అదే టైం లో ఎన్నికలు వచ్చాయన్నారు. మూడోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రులే జైలుకు వెళ్లారని తెలిపారు. గత ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వమన్నారు. మోడీ హయాంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా సుస్థిర పాలన సాగుతోందని తెలిపారు. గందరగోళ పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లేదన్నారు.

Read also: Ayodhya Ram Mandir : అంతరిక్షం నుంచి అయోధ్య మందిరం ఎలా ఉందంటే ?

జీతాలు ఇవ్వలేని పరిస్తితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పడిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక చతికిల పడ్డదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా హామీలు అమలు చేస్తుందనేది చెప్పడం లేదన్నారు. బీఆర్ఎస్ గెలిచినా ఏమి చేయలేరు.. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసిలో వేసినట్టే అన్నారు. ఆ పార్టీ ఒక్క ఎంపి గెలిచే అవకాశం లేదు… బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కు అవసరం లేదన్నారు. భారతీయ సంస్కతికి, ఆత్మగౌరవానికి ప్రతీక అయోధ్య రామమందిరం అన్నారు. రేపు అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి హిందువు పండగ చేసుకుంటున్నారని తెలిపారు.
Ayodhya Ram Mandir : అంతరిక్షం నుంచి అయోధ్య మందిరం ఎలా ఉందంటే ?

Exit mobile version