NTV Telugu Site icon

Kishan Reddy: ఎంఐఎం ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది..

Kishanreddy

Kishanreddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిడితో పని చేస్తోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పని చేస్తున్నారు.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల స్థితి బాగుండేది.. కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయం చేసేశారు.. ఏమైనా అంటే బదిలీలు చేస్తామని బెదిరిస్తున్నారు.. ఇలాంటి వారికి తగిన ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Muralidhar Rao: వ్యాపారం, కాంట్రాక్టుల్లో ప్రధాన జోక్యం కేసీఆర్ కుటుంబానిదే..!

ఇక, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జీ ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇలాంటి సర్కార్ దేశంలో లేదు.. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ కు ప్రాజెక్టును అమ్ముకుంది.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అడ్డుకునేందుకు ఆటంకవాదులు ఉన్నారు.. తెలంగాణ ప్రభుత్వ పాలసీల వల్ల డ్రగ్స్, లిక్కర్ టెర్రరిజంకు చోటు దక్కింది అని ఆయన పేర్కొన్నారు. కట్టర్ ఇస్లామిక్ టెర్రరిజం మూలాల తెలంగాణలో ఉన్నాయి.. బంగ్లాదేశ్, బర్మా రోహింగ్యాలు మజ్లీస్ అండదండలతో పెరుగుతున్నారు.. స్లీపర్ సెల్స్ లాగా వారు పెరుగుతున్నారు.. PFI తో లింకులు ఇక్కడ బయట పడ్డాయి.. ఎన్ఐఏ ఇక్కడ కొందరిని అరెస్ట్ చేసింది అని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.