నరేంద్రమోడీ రాక ముందు తెలంగాణలో ఐఎస్‌ఐ ఏజెంట్లు ఉండేవారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో
మాట్లాడుతూ.. హైదరాబాద్ లో గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్, లుంబిని పార్క్ లలో మూడుచోట్ల ఒకే సారి బాంబ్ బ్లాస్ట్ జరిగిందని, పాకిస్థాన్ ఐఎస్ఐ భారత్ ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూసిందన్నారు. ఇప్పుడు భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. మోడీ ప్రధాని అయ్యాక ఈ పదేళ్లలో మతకలాలు లేవు, కర్ఫ్యూలు లేవు, AK 47 లు లేవు, RDX లు లేవని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించడం జరిగిందని ఆయన అన్నారు. భారత్ లో విద్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ వేల కోట్లు ఖర్చు పెట్టేదన్నారు కిషన్ రెడ్డి. ఇవాళ పాకిస్థాన్‌లో ప్రజలు రొట్టె ముక్క కోసం కోట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రపంచంలో పాకిస్థాన్‌ను ఏకాకిగా నిలబెట్టామని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. వారికి వారే చంపుకు చస్తున్నారు. పాపం పండితే ఇలాంటి పరిస్థితులే దాపరిస్తాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో పాకిస్థాన్ చంపే వాళ్ళు, మనం చచ్చే వాళ్ళం.. మన ఖర్మ ఇంతే అనే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.. నరేంద్ర మోడీ వచ్చాక చరిత్ర ను తిరగ రాశామని కిషన్ రెడ్డి వెల్లడించారు. మీరు చంపితే చచ్చే వాళ్ళం కాదు.. మీరు ఒక్కరినీ చంపితే మేము పది మందిని చంపుతామని పాకిస్థాన్ కు చూపామన్నారు. ఒక్క జమ్మూ కాశ్మీర్ లోనే 46 వేల మంది భారతీయులు ఉగ్రవాదానికి బలయ్యారని, పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులను అంతం చేసి ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. బాబర్ దురాక్రమణలతో అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని ద్వంసం చేసి, బాబర్ గాడి జ్ఞాపకార్థం కోసం బాబ్రీమసీదును నిర్మించారని, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం 1990 అద్వానీ రథయాత్ర చేపట్టారన్నారు. నాటి నుంచి నేటి వరకు రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ పోరాటం చేస్తోందని, ప్రజలు శాంతిగా ఉండటం కొన్ని పార్టీలకు నచ్చడం లేదని, కుహానా సెక్యులర్ వాదులు రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.
ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదని, దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతోందన్నారు. కాంగ్రెస్ కున్న పార్లమెంట్ స్థానాలను తిరిగి గెలుచుకునే పరిస్థితులు కాంగ్రెస్ లో లేవని, మరోసారి మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని, ఒక్క అవినీతి మచ్చ లేకుండా నీతివంతoగా పరిపాలన అందించిన ఘనత మోడీ ది అని ఆయన వ్యాఖ్యానించారు.
కెసిఆర్ నెలలో 25 రోజులు సచివాలయం రాకుండా ఫామ్ హౌస్ లో ఉండేవారని, రాహుల్ గాంధీ ఏడాదిలో రెండు నెలలు విదేశాల్లో విహారం చేస్తారని, బీచ్ లలో నిక్కర్ లు వేసుకునే తిరుగుతారన్నారు. బీజేపీని, మోడీని తట్టుకోలేక అధ్యక్ష పదవికి రాజీనామ చేసి విదేశాలకు పారిపోయిన రాహుల్ గాంధీ ఇవాళ ప్రధాని అవుతాడా? తెలుగు ప్రజలకు ఇవాళ సంక్రాంతి అయితే మోడీ మూడోసారి ప్రధాని అయిన రోజే దేశ వ్యాప్త సంక్రాంతి పండుగ అని, 370 రద్దు చేసి ఉగ్రవాదులను తరిమి కొట్టినమన్నారు. పాకిస్థాన్ లో ముద్రిస్తున్న ఇండియన్ నకిలీ కరెన్సీ ని అరికట్టడానికి పెద్ద ఓట్లను రద్దు చేశామని, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశాం.. రామ మందిరా నిర్మాణము జరుగుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
