Site icon NTV Telugu

Kishan Reddy : కిషన్ రెడ్డికి సెర్బియా ఆహ్వానం

Kishan Reddy

Kishan Reddy

భారత పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి.. సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు బెల్‌గ్రేడ్‌లో జరిగే.. 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ (ITF)కు హాజరుకావాలని.. సెర్బియా పర్యాటక శాఖ మంత్రి శ్రీ హుసేన్ మెమిక్ ఆహ్వాన పత్రాన్ని పంపించారు. యూరప్, సెర్బియా ప్రాంతంలో పర్యాటక రంగాభివృద్ధికి జరిగే అతిపెద్ద ఈవెంట్కా ఇది. గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోండగా.. ఈసారి ‘అడ్వెంచర్ బిగిన్స్ హియర్’ అనే థీమ్ తో ఈ ITF జరగనుంది. వివిధ దేశాలనుంచి పర్యాటక శాఖల మంత్రులు, ఈ రంగానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు, ఇన్వెస్టర్లు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు.

Exit mobile version