Site icon NTV Telugu

Kishan Reddy : కేసీఆర్‌ బ్లాక్ డే గా ప్రకటించడం గురువిందగింజను గుర్తు చేస్తుంది

Kishanreddy

Kishanreddy

కేసీఆర్ బ్లాక్ డే గా ప్రకటించడం గురువింద గింజను గుర్తు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయించారని, ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత పేరుతో డొంక బయట పడిందన్నారు. కవిత ను దృష్టిలో పెట్టుకొని లిక్కర్ అవినీతి పై విచారణ జరగలేదని, ఢిల్లీ అధికారుల పిర్యాదు మేరకు దర్యాప్తు జరుగిందన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ మార్పులో కేసీఆఆర్ కుటుంబం హస్తం ఉన్నట్టు తేలిందని, కేసీఆర్ కూతురు కవిత నేతృత్వం లో పాలసీ తయారీకి సహకరించారన్నారు. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి ప్రతిగా ఆప్ కి డబ్బులు ఇచ్చారని ఈడి పేర్కొందని, బీజేపీ కి, కేంద్ర ప్రభుత్వం కి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేజ్రీవాల్ చేసిన అవినీతి, ప్రజా దోపిడీని విడిచి పెట్టాలా… కెసిఆర్ సమాధానం చెప్పాలని కిషన్‌ రెడ్డి అన్నారు.

అంతేకాకుండా..’సీఎం లు లిక్కర్ లో కుంబకొనం చేయడం బ్లాక్ డే నే. ఇలాంటి వాళ్లు సీఎంలు కావడం బ్లాక్ డే నే. వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని దోపిడీ చేయడం బ్లాక్ డే నే. కూతురు నీ అరెస్ట్ చేస్తే స్పందించని కెసిఆర్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఎందుకు స్పందించారు…మాజీ ముఖ్యమంత్రి ప్రజలకి చెప్పాలి. మీ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు దండుకుని ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్‌కి, కాంగ్రెస్ కి తేడా లేదు. బెల్ట్ షాపు లను ఎత్తెస్తమని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బస్తీల్లో మహిళలు మద్యం దుకాణాల వల్ల తిరగ లేక పోతున్నారు…. మద్యం వ్యాపారుల దగర ఈ ప్రభుత్వం RG tax రాహుల్ గాంధీ టాక్స్ వేస్తుందన్నారు.

తెలంగాణ లో దొచుకున్నట్టే ఢిల్లీలో దోచుకోవాలని అనుకున్నారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం లోకి మీ కూతురు ఎందుకు పోయింది… తన కుటుంబానికి సంబందమ్ లేదని కెసిఆర్ చెప్పగలుగుతారా.. కవిత చేసిన వ్యవహారాల్ని లిఖిత పూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు. బీరు, బ్రాండ్ అక్రమ వ్యాపారం చేస్తే.. దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుంది కేసీఆర్ చెప్పాలి.. అన్ని రకాల సాక్ష్యాలు ఉనాయి… వాస్తవాలు బయట పడ్డాయి… ఆప్ ప్రభుత్వం అవినీతి కి పల్పడ్డదని నేను నిరూపిస్త… చేయలేదని కెసిఆర్ నిరుపిస్తార.. ఎక్కడైన చర్చకు సిద్దం.. కవిత అరెస్ట్ కు తెలంగాణ కు, తెలంగాణ రాజకీయాలకి సంబంధంలేదు.. ఢిల్లీ అక్రమ లిక్కర్ కేసు కు సంబందించి కుంభకోణం కి సంబందించి కవిత అరెస్ట్.. తెలంగాణ అచరీస్తుంది దేశం అనుసరిస్తుంది అని కెసిఆర్ గొప్పగా చెప్పుకునే వారు..

మద్యం లో తెలంగాణ ఆచరించింది ఢిల్లీ అనుసరించింది…. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ వాళ్ళకి మద్దతు తెలపడం లో తప్పు లేదు.. BRS అవినీతి నీ కోల్డ్ స్టోరేజ్ లో కాంగ్రెస్ పెట్టింది. కిషన్ రెడ్డి నీకు దమ్ముందా అని రేవంత్ రెడ్డి మాట్లాడారు…అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించు,. కాళేశ్వరం మీద CBI దర్యాప్తు చేయించు అని.. కాళేశ్వరం పై CBI దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ కేంద్ర జలశక్తి శాఖకు పిర్యాదు చేసింది… కాంగ్రెస్ పార్టీ కి ఆప్పుడు రిప్లై కేంద్రం ఇచ్చింది… అది స్టేట్ సబ్జెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వం నీ సంప్రదించాలి అని.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లో మీరే ఉన్నారు…. సీబీఐ దర్యాప్తు చేసే అధికారం మీకే ఉంది… గతం లో ఇచ్చిన మాట మీద నిలబడి విచారణ కు అదేశించు.. కాంగ్రెస్ మాటలతో నే పూట గడపాలని అనుకుంటుంది.. ఇచ్చిన హామీలను అమలు చేసేది లేదు…. BRS అవినీతి పై విచారణ జరిపేది లేదు.. BRS సెటిల్మెంట్ చేసినట్టే కాంగ్రెస్ సెటిల్మెంట్ లు చేస్తుంది..ఢిల్లీకి వెళ్లి ఇచ్చిరమ్మని అదేశిస్తునారు…. చదరపు అడుగు కి ఇంత ఇవ్వాలని బెదిరిస్తున్నారు…. తెలంగాణ లో వసూల్ చేసే డబ్బుల మీదనే అల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తుంది’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version