NTV Telugu Site icon

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. చర్చకు నేను రెడీ..

Kishan Reddy

Kishan Reddy

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. “హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధం. ఏ ఒక్క హామీకి కనీసం కార్యాచరణ కూడా లేదు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలి సీఎం రేవంత్ స్పష్టం చెయ్యాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి బీజేపీని ఆదరించాలి. బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుంది. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ లను స్వాగతిస్తాం. ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తాం. బీజేపీతో బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో అనేక సార్లు బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది.” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: Justin Trudeau: అమెరికాని ఓడించిన కెనడా.. ట్రంప్‌‌కి ట్రూడో స్ట్రాంగ్ రిఫ్లై..

కాగా.. నిన్న నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తన మీద పగతో మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ ప్రాజెక్టును పక్కన పడేశారని సీఎం ఆరోపించారు. ప్రజా పాలన సరిగా లేదని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారని, 12 ఏళ్ల నుంచి మోడీ ప్రధానిగా ఉన్నారని, 12 నెలలుగా కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందని అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చర్చకు వస్తే ముఖ్యమంత్రిగా నేను సిద్ధమని, గత పదేళ్ల పాలనపై చర్చిద్దామని, ఈ చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ విసిరారు. తాజాగా ఈ సవాల్‌కు కిషన్‌రెడ్డి సై అన్నారు.

READ MORE: Shaktikanta Das: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్ నియామకం..