NTV Telugu Site icon

Kishan Reddy : నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలపై కాంగ్రెస్ ఆలోచన ఏంటి?

G. Kishan Reddy

G. Kishan Reddy

జమ్మూకశ్మీర్ ఎన్నికలకు సంబంధించి.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుదల, విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గారు.. మొన్న ఫారుఖ్ అబ్దుల్లా ఇంటికెళ్లి ఒప్పందం చేసుకుని వచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ కిషన్‌ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలపై కాంగ్రెస్ ఆలోచన ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని.. అన్న నేషనల్ కాన్ఫరెన్స్ ని సమర్థిస్తారా? అని ఆయన అన్నారు. చేతిలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న ఆ వ్యక్తి రాజ్యాంగాన్ని ఎప్పుడైనా చదివారో లేదో నాకు తెలియదని, పార్లమెంటు ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి.. ఇప్పుడు జమ్మూకశ్మీర్ లో రిజర్వేషన్ల పై ఏం మాట్లాడతారన్నారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకంగా ఓ జెండా ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ హామీని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-A తీసుకొచ్చి తద్వారా.. జమ్మూకశ్మీర్ లో అశాంతి, ఉగ్రవాదం పెంచాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఆలోచనకు కాంగ్రెస్ మద్దతిస్తుందా? కాంగ్రెస్ దేశ ప్రజలకు చెప్పాలి. అంబేడ్కర్ రాజ్యాంగం వద్దు, జిన్నా రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ మద్దతిస్తుందా? రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలి? అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Janhvi Kapoor: పుష్ప 2 ఐటమ్ సాంగ్ కి అడ్డుగా దేవర కాంట్రాక్ట్.. కానీ?

అంతేకాకుండా..’మేం దళితులు, బీసీలు, గిరిజనుల రిజర్వేషన్ల కోసం మేం చేస్తున్న ప్రయత్నాలు. ఉమెన్ కమిషన్, ఫారెస్ట్ డ్వెల్లర్స్ చట్టం, సఫాయీ కర్మచారి వంటి ఎన్నో చట్టాల ద్వారా మేం జమ్మూకశ్మీర్లో మార్పులు తీసుకొస్తే.. వాటిని తొలగించాలని ఎన్సీ చెబుతోంది. దీన్ని కాంగ్రెస్ సమర్థిస్తుందా? ఉగ్రవాదులను విడుదల చేస్తామంటున్న ఎన్సీకి మద్దతుగా ఉంటారా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ తో మళ్లీ చర్చలు జరపడం, తద్వారా లోయలో మళ్లీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఆలోచనకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందా. పాకిస్తాన్ తో ‘సరిహద్దు వాణిజ్యం’ పేరుతో.. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ కుట్రను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? ఉగ్రవాదం, భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడం వంటి కేసుల్లో ఉన్నవారి బంధువులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ద్వారా.. ఉగ్రవాదాన్ని, రాళ్లు రువ్వడం, రోడ్లు బంద్ చేయడం వంటి అరాచక కార్యక్రమాలకు కాంగ్రెస్ మద్దతిస్తుందా?. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో జతకట్టడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేక కుట్ర మరోసారి బహిర్గతమైంది. దళిత, గుజ్జర్, బకర్‌వాల్, ఇతర కొండజాతి వర్గాల రిజర్వేషన్లకు చరమగీతం పాడాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ దురుద్దేశాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందా?. ‘శంకరాచార్య హిల్’ ను ‘తఖ్తే సులేమాన్’గా.. ‘హరిపర్వత్’ ను‘కోహే మారన్’గా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా?.

AP Weather: ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు!
పాలనను కొందరు పాకిస్తాన్‌కు మద్దతుగా ఉండే కుటుంబాలకు కట్టబెట్టడం ద్వారా.. జమ్మూకశ్మీర్ ఆర్థిక పరిస్థితిని మళ్లీ అవినీతి, అక్రమాల్లోకి నెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా?. జమ్మూ, కశ్మీర్ లోయ మధ్య వివక్ష రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందా?. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో.. రాష్ట్రంలో విభజన రాజకీయాలకు బాటలు వేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ కుట్రలు, కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందా?. 370ని రద్దు చేసిన తర్వాత మోదీ గారి నాయకత్వంలో జమ్మూకశ్మీర్లో అభివృద్ధి జరుగుతోంది, అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జమ్మూకశ్మీర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రానున్న ఎన్నికలు మీ అభివృద్ధిని కొనసాగించే ఎన్నికలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాకిస్తాన్ తో చర్చించడం అవసరమా? ఉగ్రవాదులను మన దేశంలోకి విధ్వంసానికి కారణమవుతున్న పాకిస్తాన్ తో చర్చలు అవసరమా? ఇలాంటి ఆలోచనలు చేయడం సరైందేనా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పాలి. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను సమర్థిస్తారా? పశ్చిమబెంగాల్ లో యువ డాక్టర్ పై హత్యాచారం జరిగితే రాహుల్ ఎందుకు మాట్లాడరు. ఔరంగజేబ్ రోడ్డు పేరు మారిస్తే..దేశమంతా ఆందోళనలు చేసిన స్వయం ప్రకటిత మేధావులు .. జమ్మూకశ్మీర్లో పవిత్రమైన శంకారాచార్య పర్వతం పేరును మారుస్తామంటే ఎందుకు మాట్లాడటం లేదు. బీజేపీ జమ్మూకశ్మీర్లో ఒంటరిగానే పోటీచేస్తాం. పార్టీ నిర్ణయించిన సీట్లలో పోటీచేస్తాం’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.