రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశ భద్రతకు ప్రమాదమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నీ ఒక జోకర్ లెక్క ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. శాంతియుత వాతావరణం చెడ గొట్టాలని చూశారు… ఘర్షణలు జరగాలని అనుకున్నారని, ఒక సీఎం, ఒక మాజీ సిఎం బాగా దొరికారన్నారు కిషన్ రెడ్డి. సీఎం పేగులు మెడలో వేసుకుంటా అంటాడు… మాజీ సిఎం కళ్ళు పీకి గోళీలు ఆదుకుంటాడు అట.. వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని ఆయన మండిపడ్డారు. బీర్ బ్రాండ్ చక్రం తిప్పుతావ ఢిల్లీకి వచ్చి అంటూ కిషన్ రెడ్డి హెద్దెవ చేశారు. గెలిచిన వారికి నిలుపుకో చేతకావడం లేదు కానీ డిల్లి కి వచ్చి చక్రం తిప్పుతాడు అట.. అక్షింతలు విషయం లో హిందూ మనోభావాలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రోజుల తరబడి వేల కోట్లు ఖర్చు పెట్టీ యాగాలు చేశారు ఎందుకు చేశారు మరి అని, రెండు పార్టీలు తమ స్వార్థం కోసం పనిచేస్తున్నాయన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డీ మాట్లాడారు.. ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని ఆయన తెలిపారు. రేవంత్ పై ఇప్పటికే పోలీస్ పిర్యాదు చేశామని, న్యాయ స్థానం కి వెళ్ళడానికి కూడా వెనకాడమన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్‌పై కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఉద్దేశం బీజేపీకి లేదని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు సిగ్గులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్నీ కుట్రలు చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
