Site icon NTV Telugu

Kishan Reddy: భూములు అమ్మక పోతే పూట గడవని పరిస్థితి రేవంత్ ప్రభుత్వానిది..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: బీఆర్ఎస్ కుటుంబ పాలన మన మీద రుద్దింది.. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బంది అయిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.. తెలంగాణ ప్రజలు తనకు బానిసలుగా ఉండాలని కేసీఆర్ భావించారని ఆరోపించారు. రెండేళ్లుగా అమలు కానీ హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు నిరసనగా ధర్నాచౌక్‌లో బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. మార్పు కోసం అంటూ అభయ హస్తం అంటూ వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు ఓటు వేశారు.. సోనియా, రాహుల్, ప్రియాంకలు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం రాష్ట్రంలో తిరుగుతున్నారు.. రేవంత్ రెడ్డి యే మొఖం పెట్టుకుని రాష్ట్రంలో తిరుగుతున్నావు, ఏమీ నెరవేర్చావో ఎందుకు చెప్పడం లేదు? అని నిలదీశారు.

READ MORE: India – US: పాకిస్తాన్ పొగడ్తలు, ఖతార్ డబ్బుకు ట్రంప్ పడిపోయాడా.? భారత్-యూఎస్ మధ్య ఉద్రిక్తతలకు ఇదే కారణమా?

ఫ్రీ బస్, సన్న బియ్యం అంటున్నావు.. సన్నబియ్యంలో ఎక్కువ నిధులు కేంద్రానివే అని కిషన్ రెడ్డి తెలిపారు. “రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు సమాధానం చెప్పాలి… ఏ మార్పు వచ్చిందో చెప్పాలి.. గులాబి పోయి చెయ్యి గుర్తు వచ్చింది… కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చారు అంతే.. ఏ మార్పు రాలేదు.. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు కాంగ్రెస్ కు వెళ్ళారు.. కేసీఆర్ హయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు BRSలో చేరారు.. ఇప్పుడు BRS ఎమ్మేల్యేలు కాంగ్రెస్ లో చేరారు.. రాష్ట్రంలో ఇదే పరంపరా కొనసాగుతోంది. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా? ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు అయితే ఇందిరా పార్క్ దగ్గర చర్చకు సిద్ధమా? ప్రజా భవన్, ప్రెస్ క్లబ్ అయిన ఓకే.. మా కార్యకర్త ఎవరైనా సిద్ధం.. పోలీసులను పెట్టుకొని సభలు పెట్టుకోవడం కాదు.. అన్ని వర్గాలను
వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టింది.. భూములు అమ్మక పోతే పూట గడవని పరిస్థితి.. లక్ష కోట్లు మద్యం అమ్మకం ద్వారా సంపాదించాలని అనుకుంటుంది.. ఇచ్చిన హామీల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుంది.. రెండు పార్టీ లు అక్రమాలకు పెద్ద పీట వేసే పార్టీలు… కుటుంబ పార్టీలు, ఫిరాయింపులకు పాల్పడే పార్టీలు..” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

Exit mobile version