Site icon NTV Telugu

Kishan Reddy : దేశంలో ఉగ్రవాదం, మతకల్లోలాను మోడీ అరికట్టారు

Kishanreddy

Kishanreddy

బీజేపీ కార్యాలయంలో ఇవాళ బీజేపీ పార్లమెంట్​ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు కిషన్‌ ​రెడ్డి సమక్షంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని అనేక మంది పరిపాలించారని ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక అవినీతి మరక ఉందని, కానీ పదేళ్లుగా నరేంద్రమోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కలిసి కాంగ్రెస్​ నేతృత్వంలో ఫ్రంట్​ ఏర్పాటు చేశాయని ఎద్దేవా చేశారు.

అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలు నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్వేలన్ని కూడా నరేంద్ర మోడీకి ఎవరూ పోటీకి దరిదాపుల్లో లేరని స్పష్టం చేశాయన్నారు. దేశంలో ఉగ్రవాదం, మతకల్లోలాను మోది అరికట్టారని ఆయన అన్నారు. దేశాన్ని అనేక మంది పరిపాలించారు.. ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక్క అవినీతి మరక అని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లుగా నరేంద్ర మోడీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు కిషన్‌ రెడ్డి. ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలని చర్చ జరుగుతోందని, ఫ్రంట్ ల పేరుతో మోడీ నీ దించాలని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.

Exit mobile version