NTV Telugu Site icon

Kishan Reddy : స్వాతంత్ర దినోత్సవ పండుగ ప్రారంభమైంది

G. Kishanreddy

G. Kishanreddy

సనత్ నగర్ అసెంబ్లీ బన్సీలాల్ పేట, న్యూ బోయి గూడలో జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బన్సీ లాల్ పేట్ చాచా నెహ్రు నగర్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని సి-క్లాస్ బన్సీలాల్‌పేట – శ్రీ బండ మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. తర్వాత బన్సీలాల్ పేట శ్రీ రేణుకా ఎల్లమ్మ, శ్రీ నల్ల పోచమ్మ ముత్యాలమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం న్యూ భోయిగూడ ఉప్పలమ్మ దేవాలయం, శ్రీ నల్ల పోచమ్మ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి గారు అనంతరం శ్రీ రామాలయంలో రాములవారిలో పూజాలో పాల్గొన్నారు , తర్వాత స్కంద గిరి సుబ్రమణ్య స్వామిని ఆలయంలో జరిగిన లలిత త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకొని కుంకుమర్చనలో పాల్గొన్నారు

ఇదిలా ఉంటే.. రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీని ప్రారంభించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ పండుగ ప్రారంభమైందని, గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా పేరుతో జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారని, భారతీయ జనతా యువమోర్చ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని తిరంగా యాత్రను నిర్వహిస్తామని, 75 సంవత్సరాల స్వతంత్ర పండుగ సందర్భంగా సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారన్నారు. రేపు వచ్చే స్వతంత్ర దినోత్సవం రోజు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు కల్పించారని, అందులో భాగంగానే భారత ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వలా తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఆయన అన్నారు.

స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని దేశ సమగ్రత దేశ సమైక్యత కాపాడి స్వాతంత్ర ఉత్సవాలకు సంబంధించిన చరిత్ర ప్రపంచానికి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ఉందని, నేటి నుంచి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు తిరంగా యాత్ర కొనసాగనున్నాయని, ఈ సందర్భంగా తెలుగు ప్రజలని కోరుతా ఉన్నాను దేశ స్వాతంత్ర పండుగలో భాగస్వాములు కండి ప్రతి ఒక్కరు జాతీయ పతాకాన్ని తమ ఇంటిపై ఎగరవేయాలని కోరుతున్నానని ఆయన తెలిపారు.