Site icon NTV Telugu

ఈనెల 25న ఛార్జ్ తీసుకోబోతున్న ‘సెబాస్టియన్’

‘రాజావారు రాణి గారు’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన కిరణ్‌ అబ్బవరం గత ఏడాది ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’తో కమర్షియల్ సక్సెస్ సాధించాడు. దాంతో నాలుగైదు సినిమాలలో అతనికి హీరోగా నటించే ఛాన్స్ దక్కింది. అగ్ర నిర్మాణ సంస్థలు సైతం ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం నటించిన మూడో చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’ విడుదల తేదీని నిర్మాతలు ప్రమోద్, రాజు మంగళవారం ప్రకటించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇదే నెల 25న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

Read Also: 4న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్!

ఈ మేరకు ‘సెబాస్టియన్’ టేకింగ్ ఛార్జ్ ఫ్రమ్ ఫిబ్రవరి 25 అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యంలో తెరకెక్కితున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కిరణ్‌ అబ్బవరం సరసన నమ్రతా దారేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version