Kiran Abbavarm : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెకెక్కించారు. ఈ సినిమా 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో “క” సినిమాను ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
Read Also:LAC Border truce: చైనా ఫారెన్ మినిస్టర్‌తో భేటీ కానున్న అజిత్ దోవల్.. సరిహద్దులపై చర్చ..
ఇక మూవీ ‘క’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పూర్తి సైకలాజికల్ థ్రిల్లర్‌గా మేకర్స్ తెరకెక్కించడంతో ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసింది. ఇక ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎంతగానో ఎదురుచూసిన సక్సెస్ వచ్చింది. ప్రస్తుతం ‘క’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు మళ్లీ తన జోరును పెంచేందుకు రెడీ అవుతున్నాడు. తన నెక్స్ట్ మూవీకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించబోతున్నట్లు ఆయన తాజాగా వెల్లడించారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తాను సిద్ధమవుతున్నానని.. త్వరలోనే పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తానని ఆయన తన కొత్త లుక్‌ను తాజాగా రివీల్ చేశారు. ఇలా తన తదుపరి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ఇవ్వడంతో ప్రేక్షకుల్లో అప్పుడే క్యూరియాసిటీ పెరుగుతుంది. మరి ఈ సారి ఆయన ఎలాంటి కథతో రాబోతున్నారో చూడాలి.
Read Also:Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదంపై CP సుధీర్ బాబు రియాక్షన్