KA : సాంకేతిక కారణాల వల్ల ‘క’ ట్రైలర్ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA : యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పిరియాడిక్ థ్రిల్లర్ మూవీ “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Read Also:Pottel Movie Review: పొట్టేల్ రివ్యూ..అనన్య నాగళ్ళ హిట్ కొట్టినట్టేనా?
Also Read
టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కిన చిత్రాల్లో ‘క’ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ లభించింది. అయితే గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. “క” సినిమా ట్రైలర్ ను నేడు సాయంత్రం 5.01 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. “క” ట్రైలర్ పై మూవీ లవర్స్ అందరిలో మంచి అంచనాలే ఉన్నాయి.
Read Also:CM Chandrababu: పరిహారం అందని వారికి రెండు రోజుల్లో సాయం.. సీఎం కీలక ఆదేశాలు
కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ సమయాన్ని సాయంత్రం 5.01 గంటల నుండి రాత్రి 7 గంటలకు మార్చారు. అయితే, అప్పటికి కూడా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో కాస్త అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నేడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఉండదని.. సాంకేతిక సమస్యల వల్ల ఈ చిత్ర ట్రైలర్‌ను రేపు(అక్టోబర్ 25) రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. “క” సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కొనుగోలు చేసి విడుదల చేస్తున్నారు, మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నాడు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!