Site icon NTV Telugu

Kiran Abbavaram : ఇబ్బంది పడుతూనే ఆ సాంగ్ ను చేశాను..

Whatsapp Image 2023 10 05 At 10.18.44 Am

Whatsapp Image 2023 10 05 At 10.18.44 Am

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరో రాజావారు రాణి గారు సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా తో కిరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమా లో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఆ తరువాత నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.రత్నం కృష్ణ దర్శకుడు. ఏ.ఎం.రత్నం సమర్పిస్తున్న ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది.ఈ సందర్భం గా కిరణ్‌ అబ్బవరం ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.కిరణ్ మాట్లాడుతూ రూల్స్ రంజన్ సినిమా అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ సినిమా అని తెలిపాడు..

ఫస్ట్ హాఫ్ అంతా నవ్వులు. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్‌’ అని చెప్పాడు.ఇందులో నా పాత్ర కాస్త ప్రత్యేకం గా ఉంటుంది. అమ్మ పెట్టే రూల్స్‌ మధ్య పెరగడంవల్ల ఫస్ట్ హాఫ్ లో బుద్ధిమంతుడైన విద్యార్థిగా కనిపిస్తా. సెకండ్ హాఫ్ లో ఉద్యోగస్తుడి గా కనిపిస్తా.ఇక్కడ నా రూల్స్‌ వల్ల తోటి ఎంప్లాయిస్‌ సఫర్ అవువుతుంటారు ‘ అని తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు కిరణ్‌ అబ్బవరం.ఈ సినిమా లో హీరోయిన్ నేహా శెట్టి పాత్ర చాలా కీలకం. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుటయింది. కాకపోతే ఇందులో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ ఉంటుంది. ఆ పాటలో నటించడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. ఇలాంటి పాటల్లో నటించడానికి మా సీనియర్‌ హీరోలు ఎంత ఇబ్బంది పడేవారో నాకు అప్పుడు అర్థమైంది. కథను నమ్మి ఈ సినిమా చేశాను. దర్శకుడు రత్నం కృష్ణ పూర్తి క్లారిటీ తో సినిమా ను తెరకెక్కించారు’ అని కిరణ్‌ అన్నారు.

Exit mobile version