కిరణ్ అబ్బవరం ఈ యంగ్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో రూల్స్ రంజన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.కిరణ్ అబ్బవరం హీరోగా రతినం కృష్ణ రచన మరియు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ రూల్స్ రంజన్. ఈ చిత్రం ను అక్టోబర్ 6, 2023 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ మరియు సాంగ్స్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఆవెంట్ గ్రాండ్ గా జరిగింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఆయన మాట్లాడుతూ సినిమా గురించి మాట్లాడాలి అంటే చాలా ఉంది అన్నారు కిరణ్ అబ్బవరం. మన తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందో అందరం చూస్తూనే ఉన్నాం.టాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రిటీ స్టార్స్ ఉన్నారు. ఏదో ఒక రోజు మీ సపోర్ట్ తో నేను కూడా ఆ స్థాయికి వెళ్తాను అన్నారు కిరణ్. ఇంకొ ఏడాది టైమ్ ఇవ్వండి.. కచ్చితంగా మీరు గర్వపడేలా సినిమా చేస్తాను అందరు షాక్ అయ్యే విధంగా సినిమా చేస్తాను అన్నారు కిరణ్. కిరణ్ కామెంట్లు చూస్తుంటే.. వచ్చే ఏడాది లో భారీ స్థాయి పాన్ ఇండియా సినిమా సెట్ చేసినట్లు తెలుస్తుంది..అలాగే కిరణ్ అబ్బవరం ట్రోలర్స్ గురించి, సినిమా రివ్యూస్ గురించి కూడా మాట్లాడారు. ముందుగా తనను ఇంతలా ఆదరిస్తున్న ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పారు కిరణ్. తాను యూట్యూబర్ గా ఉన్నప్పటి నుంచి ఎంతగానో ఆదరిస్తూ హీరోగా తన ఎదుగుదలకు ఎంతో ప్రోత్సహించినందుకు మీకు రుణపడి వుంటాను అని తెలియజేశారు…సినిమాలపై రివ్యూస్ వస్తుంటాయి. బాగోలేకపోతే ట్రోల్స్ కూడా చేస్తుంటారు.తిడుతుంటారు, మెచ్చుకుంటారు కానీ అందరు ఏది చేసినా సినిమా కోసమే.. ట్రోల్ చేసేవారు కూడా సినిమా అంటే ఇష్టం ఉండబట్టే ట్రోల్ చేస్తారు.సినిమాపై ఎంత ప్రేమ లేకుంటే రివ్యూస్ ఇస్తారా కాని మీరు ఏది చేసినా సినిమా కోసమే చేయండి అని కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు