NTV Telugu Site icon

Kiran Abbavaram First Movie : ఎట్టకేలకు టీవీ లోకి వచ్చేస్తుందిగా..

Whatsapp Image 2023 09 08 At 4.35.08 Pm (1)

Whatsapp Image 2023 09 08 At 4.35.08 Pm (1)

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా రాజా వారు రాణి గారు. కిరణ్ అబ్బవరం 2019లో రిలీజైన రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమ్యాడు. మినిమమ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.. డీసెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తన యాక్టింగ్‌ తో అదరగొట్టాడు.అలాగే తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాడు.తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన నాలుగేళ్ల తర్వాత టీవీలో టెలికాస్ట్ కాబోతుంది.. సెప్టెంబర్ 10 వ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈటీవీ లో ఈ సినిమా టెలికాస్ట్ కానుంది. ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్‌ను ఈటీవీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. రాజా వారు రాణిగారు సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో రహస్య గోరక్ హీరోయిన్‌గా నటించింది. రాజ్‌కుమార్ కసిరెడ్డి మరియు యజుర్వేద్ గుర్రం ముఖ్య పాత్రలను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది.రాజా వారు రాణిగారు సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ఆ తరువాత ఎస్. ఆర్. కల్యాణ మండపం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో కూడా తనకి మంచి విజయం లభించింది. ఆ తరువాత కిరణ్ అబ్బవరం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తున్నాడు.గత ఏడాది అతడు నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి.. ఈ ఏడాది ఇప్పటికే వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. రూల్స్ రంజన్‌తో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న మరో రెండు సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటోన్నాయి.తాజాగా రూల్స్ రంజన్ ట్రైలర్ విడుదల అయింది.ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన సమ్మోహనుడా సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది.