NTV Telugu Site icon

Beer Powder : కేసులు కేసులు కాదు.. ప్యాకెట్లు ప్యాకెట్లు బీరు కొట్టేయొచ్చు

Beer

Beer

Beer Powder : ఎండలు మండుతున్నాయి.. నోరు ఎండుతోంది.. చల్లటి బీరు ఉంటే బాగు అనిపిస్తుంది కదూ.. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వైన్ షాపుకు పోలేరు. ఇంట్లోనే బీరు తయారు చేసే ట్రిక్ తెలిస్తే బాగుండు అనుకుంటారు చాలామంది. అలాంటి వారికోసమే ఓ శుభవార్త. ఇక ఎంచక్కా బీరును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఎప్పుడంటే అప్పుడు సీసాలకు సీసాలు తాగేయొచ్చు.

Read Also:Anand Mohan: గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ విడుదల.. వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్

కింగ్ ఫిషర్ కంపెనీ ఓ కొత్త ప్రొడక్టును మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పుడు బీర్ పౌడర్ మిక్స్ తయారు చేసింది. కింగ్ ఫిషర్ మనదేశంలో బీరు తయారీలో కింగ్ మేకర్. లీడింగ్ బీర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ ప్యాకెట్లు వచ్చాయి. యునైటెడ్ బ్రివరీస్ గ్రూప్ సంస్థ కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ ను విడుదల చేసింది. ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీతో బీర్ సాచెట్స్ పౌడర్ ను దేశంలోని మందుబాబుల కోసం తీసుకొచ్చింది. బీర్ పౌడర్ మిక్స్.. వీటినే బీర్ సాచెట్స్ అని పిలుస్తుంటారు. ఈ బీర్ పౌడర్ తో బీరు తయారు చేయడం ఎలా అంటే.. బీర్ సాచెట్స్ , నీళ్లు ఉంటే చాలు.. క్షణాల్లో బీర్ సిద్ధమవుతుంది. మీకు దగ్గరలో జగ్ కానీ, మగ్ కానీ, మినరల్ వాటర్ డబ్బాకానీ ఏది వున్నా ఒకేసారి బీర్ పౌడర్ కలిపి నురగలు కక్కే రుచికరమైన బీరును తయారుచేసుకోవచ్చు.

Read Also: RTC Kalabhavan: ఆర్టీసీ కళా భవన్‌ సీజ్.. అద్దె కట్టకపోవటం వల్లే..!

బీర్ పౌడర్ శాంపిల్స్ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు కింగ్ ఫిషర్ కంపెనీ అవకాశం కల్పించింది. ఇందుకు kingfisherworld.com/instantbeer లో రిజిస్టర్ చేసుకోండి. వెంటనే బీర్ పౌడర్ ప్యాకెట్ల కోసం ఆర్డర్ చేయండి.. కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ తో బీర్ తయారీకి సంబంధించి సంస్థ యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో వైరల్ గా మారింది. అయితే, అది నిజమైనది కాదని కొందరు కొట్టిపారేస్తున్నారు. వీడియోలో కూడా ఇన్ స్టంట్ బీర్ పౌడర్ ను చూపించడంతో బీరు ప్రియులంతా తమ పేర్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు.

Show comments