NTV Telugu Site icon

King of Kotha : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరోలు..?

Whatsapp Image 2023 08 13 At 7.56.16 Am

Whatsapp Image 2023 08 13 At 7.56.16 Am

దుల్కర్ సల్మాన్ ఈ హీరో కు మలయాళం తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన మలయాళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూ ఉంటాయి.ఈ యంగ్ హీరో తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలు చేస్తున్నాడు.తెలుగులో ఈ హీరో మహానటి, సీతారామం సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు ఈ యంగ్ హీరో కి తెలుగులో మంచి గుర్తింపు తీసుకోని వచ్చాయి. దీనితో ఈ యంగ్ హీరో కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.ఈక్రమంలో దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన ఓ సినిమాను టాలీవుడ్ లో కూడా విడుదల చేయబోతున్నాడు. దుల్కర్ సల్మాన్ తాను తాజాగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కోత. తాజాగా ఈ మూవీకి సంబంధించిన యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేసారు.

ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు.. కాగా కింగ్ ఆఫ్ కోతాలో దుల్కర్ సల్మాన్ తో పాటు ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను ఓనం పండుగ సందర్బంగా ఆగష్టు 24 న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. తెలుగులో ఈ సినిమాకు అంతగా హైప్ లేకపోవడంతో ఎలాగైనా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది. దీనితో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 13) న ఎంతో గ్రాండ్ గా జరగబోతుంది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన నేచురల్ స్టార్ నాని, దగ్గుపాటి రానా ముఖ్య అతిధులుగా రానున్నారు. మరి ఈ సినిమా విడుదల అయి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.