Site icon NTV Telugu

King Charles: ప్రిన్స్ మీ వయసెంత?.. కింగ్‌ చార్లెస్‌ను ప్రశ్నించిన చిన్నారి.. వీడియో వైరల్

King Charles

King Charles

King Charles: సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్ జీరో వాల్తామ్‌స్టోవ్‌ను సందర్శించడానికి బ్రిటన్ చక్రవర్తి చార్లెస్‌-3 ఇటీవల తూర్పు లండన్‌కు వెళ్లారు. లోపలికి వెళుతున్నప్పుడు ఆయన బార్న్ క్రాఫ్ట్ ప్రైమరీ స్కూల్ పిల్లలతో కబుర్లు చెప్పారు. రాజు వారితో కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఆ చిన్నారుల్లో ఒకరు జెండాను ఊపుతూ రాజును ఉత్సాహపరిచాడు. కింగ్ చార్లెస్‌ ఆ విద్యార్థులతో సెలవులు గురించి, లంచ్‌ సమయం గురించి కొన్ని కుశల ప్రశ్నలు వేశారు. అందులో ఓ చిన్నారి రాజును మీ వయస్సు ఎంత?.. అని ముద్దుగా అడిగింది. ఆ విద్యార్థి ప్రశ్నతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. దీనికి చార్లెస్‌ తనదైన శైలిలో.. ‘గెస్‌ చేయండి’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు.

Baby Found In Toilet: పబ్లిక్‌ టాయిలెట్‌లో నవజాత శిశువు.. మాతృత్వాన్ని మరిచిన తల్లి

కింగ్ చార్లెస్ తన హాస్యాన్ని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కామెన్‌వెల్త్‌ గేమ్‌ 2022 ప్రారంభోత్సవ వేడుకల్లో ఒక వ్యక్తి మనం బీర్‌ వద్దకు వెళ్లగలమా అని ప్రశ్నిస్తే ఇలానే హాస్యాన్ని పండించాడు. చిన్నారులతో కలిసి రాజు ఆనందం పంచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 73 ఏళ్ల వయస్సులో కింగ్‌ చార్లెస్‌ అధికారికంగా కొత్త రాజుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version