King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్‌ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!

  • నాగార్జున పుట్టినరోజు సందర్భంగా..
  • అక్కినేని నాగార్జున 100వ సినిమా ‘కింగ్ 100’ గ్లింప్స్ విడుదల..
  • సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు..
King 100 Glimpse

King 100 Glimpse

King 100 Glimpse: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా ‘కింగ్ 100’. తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా అప్‌డేట్స్ లేకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం అదిరిపోయే గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

‘కింగ్ 100’ గ్లింప్స్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ‘‘మనుషుల్లో రెండు రకాలు. ఒకరు డబ్బున్నోళ్లు, ఇంకొకరు లేనివాళ్లు. డబ్బు లేనప్పుడు నన్ను అందరూ లూజర్‌లా చూశారు. డబ్బు ఉన్నప్పుడు ‘దే కాల్ మీ ది కింగ్’. దిస్ ఐడెంటిటీ ఈజ్ మోర్ పవర్‌ఫుల్ దెన్ మనీ. ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవడం కోసం నేను పరిగెడుతూనే ఉండాలి’’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ సినిమా ఎలాఉండబోతుందో చెప్పకనే చెప్పశారు.

గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్‌ను బట్టి చూస్తే నాగార్జున పాత్ర పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగే ప్రయాణం చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. డబ్బు లేని సమయంలో ఎదుర్కొన్న అవమానాలు, ఆ తర్వాత డబ్బు సంపాదించి సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం.. ఆ గుర్తింపును కాపాడుకోవడానికి అతను చేసే పోరాటం సినిమాకు కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే నాగార్జున పాత్ర అసలు ఎలా ఎదిగింది? సంపదను సంపాదించడానికి ఏం చేశాడు? అతని ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? అనేది వెండితెరపై చూడాల్సిందే.

గ్లింప్స్‌లో మరో ఆసక్తికరమైన అంశం.. చివర్లో నాగార్జున ఓ చిన్నారిని ఎత్తుకుని కనిపించారు. ఆ పాప ఎవరు? నాగార్జున పాత్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిన్నారి పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందా? లేక నాగార్జున పాత్రలోని మరో కోణాన్ని చూపించేందుకు మాత్రమే ఈ సన్నివేశాన్ని ఉపయోగించారా? అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.