NTV Telugu Site icon

Kim Kardashian: బాబోయ్.. కిమ్ కర్దాషియన్ హ్యాడ్ బ్యాగ్ ధర అన్ని కోట్లా?

Kim

Kim

ఈ మధ్య సెలెబ్రేటీల వస్తువులు, వాటి ధరలు అనేవి నెట్టింట తెగ వినిపిస్తున్నాయి.. మొన్న బాలివుడ్ హీరోయిన్స్, మోడల్స్ వస్తువులు హాట్ టాపిక్ అవ్వగా, నిన్న టాలివుడ్ హీరోయిన్స్ వాడే వస్తువుల ధరలు, మోడల్స్ నెట్టింట తెగ వినిపించేవి.. ఇప్పుడు తాజాగా హాలివుడ్ మోడల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.. అమెరికన్ మోడల్, నటి కిమ్ కర్దాషియన్ పేరు వినే ఉంటారు.. ఎప్పుడు ఏదొక వార్తతో నెట్టింట ట్రెండ్ అవుతుంది..తన ఫ్యాషన్ తో ఎప్పటికప్పుడు కర్దాషియన్ అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది..

ఎక్కడ కనిపించిన ఏదొక ప్రత్యేకతను చాటుకుంటుంది… తాజాగా మరోసారి అందరి చూపును తనవైపు తిప్పుకుంది..ఈమె ఓ ఫుట్ బాట్ గేమ్ చూసేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించి ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ను కిమ్ కర్దాషియన్ తన వెంట తీసుకురావడం. తన చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ ధర కోట్లల్లో ఉండటం విశేషం. దాని ప్రైజ్ తెలిస్తే ఎవ్వరైనా సరే నోరెళ్ల బెట్టాల్సిందే. ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాల 3,12,16,000 ఉంటుందని తెలుస్తోంది..

కోట్లు పెట్టేంత అందులో ఏముంది అంటూ అందరు షాక్ అవుతున్నారు..ఆ బ్యాగ్ ను హిర్మేస్ అనే కంపెనీ తయారు చేయడం విశేషం. అతి కొద్ది మంది కోసం ఇలాంటి బ్యాగ్ లను తయారు చేస్తుంటారంట. దాన్ని గోల్డ్, డైమాండ్స్ తో డిజైన్ చేయడం వల్ల ఖరీదు కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది.. ఇక ఆ ఈవెంట్ లో ఈ అమ్మడు వేసుకున్న డ్రెస్సు కూడా లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది.. స్లీవ్ లెస్ టాప్, లూస్ ఫిట్ ట్రౌజర్, బ్లూ షూస్ ధరించి స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. సింపుల్ అండ్ అట్రాక్టివ్ గా గేమ్ ను చూసేందుకు వచ్చి సెన్సేషన్ గా మారింది. ఆమె దగ్గర కాస్ట్లీ థింగ్స్ ఉన్నాయి.. మొత్తానికి వయస్సు పెరుగుతున్నా జోష్ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలు చేస్తుంది..

Show comments