Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్‌ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎమ్ఐ న్యూయార్క్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పాకిస్తాన్ సంతతికి చెందిన యూఎస్ఏ బౌలర్ ఆసిఫ్ మహమూద్తో మైదానంలోనే పెద్ద గొడవకు దిగాడు. పొలార్డ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నప్పుడు, ఆసిఫ్ వేసిన బంతిని డిఫెండ్ చేశాడు. ఆ బంతిని అందుకున్న ఆసిఫ్, కోపంతో పొలార్డ్ వైపు విసురుతానంటూ అగ్రెసివ్‌గా సైగ చేశాడు. దీంతో తీవ్ర కోపానికి గురైన పొలార్డ్, గతంలో మిచేల్ స్టార్క్‌తో జరిగిన ఐపీఎల్ వివాదాన్ని గుర్తుచేస్తూ బౌలర్‌పైకి బ్యాట్ ఎత్తాడు. చివరి క్షణంలో తనను తాను కట్టడి చేసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది.
రికార్డు సెంచరీ వృథా..
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్, మిచెల్ ఓవెన్ (155 రన్స్) విధ్వంసకర ఇన్నింగ్స్ సాయంతో 20 ఓవర్లలో 245/5 భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ ఛేదనలో ఎమ్ఐ న్యూయార్క్ జట్టును కీరన్ పొలార్డ్ తన వీరోచిత శతకంతో ఒంటిచేత్తో నడిపించాడు.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
The bowler charged through in his follow-through… and suddenly it felt like we’d seen this movie before. 😮💨🔥#KieronPollard found himself in a familiar moment, reminding fans of that iconic Pollard-Starc face-off from years gone by.
Some rivalries. Some reactions. Never get… pic.twitter.com/RS0zjp181L
— Star Sports (@StarSportsIndia) June 21, 2026
56 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు బాదడమే కాకుండా, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ (14,562 రన్స్) ఆల్‌టైమ్ రికార్డును బద్దలుకొట్టాడు. అయితే, ఇతర బ్యాటర్ల నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో ఎమ్ఐ న్యూయార్క్ 215/6 పరుగులకే పరిమితమై 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!