NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్ లో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్

Hyd Missing

Hyd Missing

హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్ కు గురయ్యారు. సికింద్రాబాద్ లోని ప్యారడైస్ లో ఐదేళ్ల పాపతో పాటు సుల్తాన్ బజార్ లో రెండేళ్ల బాబు ను కూడా నిందితులు ఎత్తుకోని వెళ్లారు. గంటల వ్యవధిలోని కిడ్నాప్ ను మహంకాళి పోలీసులు చేధించారు. అయితే హైదరాబాద్‌లో కిడ్నాప్‌ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్యారడైస్ ఫూట్ పాత్ దగ్గర కిడ్నాప్‌ అయిన చిన్నారి ఆచూకీని పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున 4 గంటలకు పాప కిడ్నాప్‌ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో దీంతో రంగంలోకి దిగిన నాలుగు బృందాలు.. కిడ్నాపర్లను పట్టుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. దంపతుల దగ్గర కిడ్నాప్‌ అయిన పాపతో పాటు మరో చిన్నారిని కూడా వారు గుర్తించారు.

Also Read: Katakam Sudarshan: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

ఉదయం 4గంటలకు ప్యారడైస్ ఫుట్‌పాత్ వద్ద నిద్రిస్తున్న చిన్నారిని ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు అందిందని.. మహంకాళి ఏసీపీ రమేష్ వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు అన్నారు. కిడ్నాప్ కు గురైన చిన్నారి క్షేమంగా ఉందన్నారు. అయితే, వారి వద్ద మరో చిన్నారిని గుర్తించామని.. సుల్తాన్ బజార్ బొగ్గులుకుంటలో శివ అనే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు.

Also Read: Healthy Recipes: రాగితో రుచికరమైన వంటలు..

దంపతుల అరెస్ట్‌తో కిడ్నాప్‌ కు సంబంధించిన లింక్స్‌ బయటపడుతున్నాయి. ఫుట్‌పాత్‌పై నిద్రించే చిన్నారులను టార్గెట్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులను కిడ్నాప్ చేసి ఎవరికి విక్రయిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. కిడ్నాప్ తర్వాత చిన్నారులను అమ్ముతున్నట్టు డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు వీరు ఎన్ని కిడ్నాప్ లు చేశారు. కిడ్నాప్ లకు ముందు ఎవరెవరినీ సంప్రదించారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.