Site icon NTV Telugu

Kichannagari Laxma Reddy: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కిచన్న గారి లక్ష్మారెడ్డి

Klr

Klr

రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన గారి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.

Read Also: Byju’s: రూ.9 వేల కోట్లు చెల్లించండి.. బైజూస్‌కు ఈడీ నోటీసులు

అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. సేవకుడిగా ఈ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్, బీజెపి పార్టీలను నమ్మవద్దని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. సరి కొత్త ప్రణాళికతో పాటు మంచి విజన్ తో కొత్త ఆలోచనతో మహేశ్వరం నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.

Exit mobile version