NTV Telugu Site icon

Kiccha Sudeep: అయ్యబాబోయ్.. హీరో సుదీప్‌కు ఇంత పెద్ద కూతురా..? హీరోయిన్‌ లు కూడా పనికి రారుగా..

Sudeep

Sudeep

Kiccha Sudeep: కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రతారాలలో ఒకరైన కిచ్చా సుదీప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుదీప్ కేవలం సినిమా హీరో మాత్రమే కాకుండా.. దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, టెలివిజన్ హోస్ట్ సింగర్ ఇలా అన్ని భాగాలలో ప్రావీణ్యం సంపాదించారు. మొదట్లో సపోర్టింగ్ రోల్ తో కెరియర్ ని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు కన్నడ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇకపోతే ఈ కన్నడ సూపర్ స్టార్ ప్రియా అనే యువతని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కూతురు కూడా ఉంది. హీరో కూతురు అంటే ఏదో చిన్న అమ్మాయి అని అనుకున్నారేమో.. ఆ అమ్మాయికి ఇప్పుడు 20 ఏళ్లు. ఏంటి సుదీప్ కి ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును ఆ అమ్మాయి పేరు శాన్వి సుదీప్.

శాన్వి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆ అమ్మాయి మంచి సింగర్ కూడా. ఈ మధ్య హీరో మేనల్లుడు సంచిత్ సంజీవ్‌ను పరిచయం చేస్తూ.. ఓ సినిమా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో… కూతురు శాన్వితో సినిమాలో పాటలు పాడించారు. ఇకపోతే సుదీప్ కూతురు శాన్వి హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం శాన్వి చదువుతున్న కారణంగా కేవలం గాయనిగా మాత్రమే కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరో సుదీప్ శివమొగ్గలో జన్మించారు. ముంబైలో యాక్టింగ్ కోర్సు చేసిన ఆయన.. 1997లో థయవ్వా అనే చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక కిచ్చ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన సినిమా పేరుని కలుపుతూ కిచ్చ సుదీప్ అంటూ అభిమానులు ఆయనను ముద్దుగా పిలుస్తారు. ఇకపోతే టాలీవుడ్ సినిమాలలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సీరిస్ లో, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో నెగిటివ్ రూల్స్ చేసినప్పటికీ మంచి ప్రేక్షక ఆదరణ పొందాడు. కన్నడ బిగ్ బాస్ షో కి సుదీప్ వ్యాఖ్యాతగా పనిచేస్తున్నారు.

Show comments