Site icon NTV Telugu

Kia Clavis: ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ ఫీచర్లతో భారత్‌లో విడుదలైన కియా క్లావిస్.!

Kia Clavis

Kia Clavis

Kia Clavis: కియా మోటార్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 3 వరుసల రిక్రియేషనల్ వెహికల్ కియా క్లావిస్ (Kia Clavis) నేడు (మే 8) భారత్‌లో అధికారికంగా విడుదల అయ్యింది. ఇది కియా క్యారెన్స్ కంటే అగ్రస్థానంలో ఉండే ప్రీమియమ్ మోడల్‌గా మార్కెట్‌లోకి వచ్చింది. ఇక ఈ కారు సంబంధించి అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించకపోయినప్పటికీ, కొన్ని కియా డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ వాహనం సిల్వర్ గ్లాస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్క్లింగ్ సిల్వర్, ఔరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్ వంటి ఎనిమిది మోనోటోన్ రంగులలో లభ్యమవుతుంది.

Read Also: Motorola Razr 60 ultra: ఇట్స్ కన్ఫామ్.. మే 13న భారత్‌లో విడుదకు సిద్ధమైన మోటరోలా రేజర్ 60 అల్ట్రా.!

ఇక ఈ కారులో అధునాతన ఫీచర్లు, సాంకేతికత విషయాలను చూసినట్లయితే.. క్లావిస్‌లో మొత్తం 30 అంగుళాల డిస్‌ప్లే సెటప్ ఉంటుంది. ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా 4 రకాల ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా అండ్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, పనోరామిక్ సన్‌రూఫ్ అండ్ స్లైడింగ్, రీక్లైనింగ్ సెకండ్ రో సీట్లు ఉన్నాయి.

Read Also: Hari Hara Veera Mallu: ఫాన్స్ కి పండగే… రిలీజ్ డేట్ వచ్చేసింది!!

అలాగే, ఈ కారులో లెవెల్ 2 ADAS టెక్నాలజీతో కూడిన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్టెన్స్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ (కొత్తగా), అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్టెన్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇంజిన్ ఆప్షన్లు, గేర్‌బాక్స్ విషయానికి వస్తే.. క్లావిస్‌లో కారు మాదిరిగానే మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ల నేచురల్ పెట్రోల్ ఇంజిన్ 114bhp పవర్, 144Nm టార్క్ ఉత్పత్తి చేయగా.. టర్బో డీజిల్ ఇంజిన్ లో 114bhp పవర్, 250Nm టార్క్, అలాగే టర్బో పెట్రోల్ ఇంజిన్ లో 157bhp పవర్, 253Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. అలాగే ఈ వాహనానికి డ్యూయల్-టోన్ పేయింట్ ఆప్షన్‌లు లేవు. కానీ, ఒక్కో రంగు డిజైన్‌తో పక్కా ప్రీమియమ్ లుక్‌ను అందిస్తుంది. ఇది క్లావిస్‌ను మార్కెట్లో ఉన్న ప్రీమియమ్ ఎంట్రీ లెవెల్ SUV లలో ప్రత్యేకంగా నిలబెడుతుంది.

Exit mobile version