Kushi : ఓటీటీలో అదరగొడుతున్న ఖుషి మూవీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 1న విడుదల అయింది.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది.సినిమా లో పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో అదే స్థాయిలో సినిమా కూడా ఉంటుందని ఫ్యాన్స్ అంతా భావించారు.కానీ సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది..థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఖుషీ మూవీ. అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ లోఖుషి మూవీ స్ట్రీమ్ అవుతోంది. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలి మూడు రోజులూ ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వచ్చింది.నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న తెలుగు వెర్షన్ టాప్ లో ఉండగా.. హిందీ వెర్షన్ మాత్రం రెండోస్థానంలో ఉంది. ఇక ఖుషీ తమిళ వెర్షన్ ఆరో స్థానంలో ఉంది.. అంటే టాప్ 10లో ఖుషీ మూవీ వివిధ భాషల వెర్షన్లే మూడు ఉన్నాయి.
ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా మంది అభిమానులకు అంతగా నచ్చలేదు.అయితే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను మెప్పించాయి.అలాగే విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది.. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఎప్పుడూ దేవుడిని ఆరాదిస్తూ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఇంట్లో పుట్టిన హీరోయిన్.. పరమ నాస్తికుడైన వ్యక్తి ఇంట్లో పుట్టిన హీరో మధ్య లవ్ స్టోరీ, పెళ్లి ఆ తర్వాత వచ్చే సమస్యల చుట్టూ ఖుషీ కథ తిరుగుతుంది. అయితే కాస్త ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే అయినా కూడా దీనిని ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది.అయితే ఈ సినిమాకు ఆడియన్స్ ని వచ్చేలా చేసింది మాత్రం పాటలు మరియు మ్యూజిక్ అని చెప్పాలి.ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో లక్ష్మి, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణలాంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
తాజావార్తలు
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!