Site icon NTV Telugu

Kishan Reddy : రాజకీయ నేతలకు కూడా క్రీడలు నిర్వహిస్తాము

Kishan Reddy

Kishan Reddy

నిజాం కాలేజీ గ్రౌండ్ లో “ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ” స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్, పుల్లెల గోపీ చంద్, జేజే శోభ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. పుల్లెల గోపీచంద్, జేజే శోభ లకు సన్మానం చేశారు. ఖేలో తెలంగాణలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ నాయకులకు కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉండాలన్నారు. అది లేకుండా పోయిందని, రాజకీయ నేతలకు కూడా క్రీడలు నిర్వహిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. దేశం ప్రపంచంలో అన్ని రంగాల్లో దూసుకు పోతుందని, ఐటీ, బహుళ జాతి సంస్థలకు సారథ్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా… క్రీడ రంగంలో మాత్రం వెనుకబడి ఉన్నామని, క్రీడలను ప్రోత్సహించడానికి మోడీ ప్రత్యేక శ్రద్ద పెట్టారని ఆయన వెల్లడించారు. క్రీడ కారులను వెలికి తీసుకు రావడానికే ఈ ఖేలో తెలంగాణ కార్యక్రమం అని ఆయన వివరించారు. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులుతో పాటు, నగదు పారితోషికం ఉంటుందని ఆయన వెల్లడించారు.

Also Read : Pakistan Girl : లూడో గేమ్‎తో ఒక్కటయ్యారు.. అధికారులేమో వద్దుపొమ్మన్నారు

అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. తమ పిల్లల చదువుకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. క్రీడ రంగంలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని, రాజకీయ నేతల్లో క్రీడ స్ఫూర్తి లేదని ఆయన అన్నారు. అందుకే క్రీడల్లో రాజకీయ నాయకులను భాగస్వామ్యం చేస్తున్నారు మోడీ వెల్లడించారు. క్రీడ ప్రాంగణాలు పెరగాలని, హైదరాబాద్‌లో ఉన్న ప్లే గ్రౌండ్ లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని ఆయన తెలిపారు. మద్యం సెంటర్ లు కాదు స్పోర్ట్స్ సెంటర్ లు కావాలని, బెల్ట్ షాప్ లు మూత పడాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు నిధులు కేంద్రం ఇవ్వనుందని ఆయన వెల్లడించారు.

Also Read : Brazil Floods: బ్రెజిల్‌లో వరద బీభత్సం.. 36 మంది మృతి

Exit mobile version