సికింద్రాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్లో నేడు సాయంత్రం జరిగే ‘ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ క్రీడలు’ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్థానిక బిజెపి నాయకులు, కార్యక్రమ నిర్వహకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు వస్తున్నారని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా, అన్ని రాష్ట్రాలు మరియు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలలో క్రీడాకారులందరికీ క్రీడలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఖో ఖో అనే 5 క్రీడాంశాలను నిర్వహిస్తున్నామన్నారు.
Also Read : Cruel Woman: ప్రియుడి సాయంతో భర్త, అత్తను ముక్కలుగా నరికింది.. కవర్లో పెట్టి కాల్వలో వేసింది
నియోజకవర్గంలోని ప్రజలందరూ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. మన దేశ జనాభాకు తగ్గట్టు క్రీడాకారులు లేరని అందుకే మోదీ సర్కార్ యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారు.
Also Read : Fake Currency: నకిలీ కరెన్సీ అడ్డాగా పాతబస్తీ.. మహిళ సహా ముగ్గురు అరెస్ట్
కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతోన్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్ గా ఇండియన్ వెయిట్ లిఫ్టర్, అర్జున్ అవార్డు గ్రహీత కరణం మల్లీశ్వరి, ప్రముఖ బ్యాడ్మెంటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రానున్నారు. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి హీరో సాయి ధరమ్ తేజ్, హీరో మంచు మనోజ్, హీరోయిన్ శ్రీలీల ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
