Site icon NTV Telugu

Khazana Jewellers Robbery: ఖజానా జ్యువెలర్స్ దొంగతనం కేసులో కీలక పురోగతి..

Chanda Nagar Khazana Jewellery

Chanda Nagar Khazana Jewellery

Hyderabad Khazana Jewellers Robbery Case: ఖజానా జ్యువెలర్స్ దొంగతనం కేసులో కీలక పురోగతి లభించింది.. ముగ్గురు దోపిడీ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సిగాన్, సారక్ గ్యాంగులుగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు దొంగతనానికి ముందు పటాన్ చెరువు ఆర్సీపురం చందానగర్ లోని జ్యువెలరీ షాపులపై రెక్కీ నిర్వహించారు. 10 జ్యువెలరీ షాపుపై రెక్కీ చేసింది ఈ గ్యాంగ్. అనంతరం చోరీ చేసి.. నిమిషాల్లోనే సిటీ దాటేందుకు ప్లాన్ వేసింది. రెక్కీ చేసి రూట్ మ్యాప్ ని కూడా ట్రయల్ వేసుకుంది. హైదరాబాద్ నుంచి బీదర్ వరకు వాహనాల్లో ఆటోల్లో బస్సుల్లో వెళ్లి రెక్కి పూర్తి చేసుకుంది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పలు చర్యలు చేపట్టుకుంది. సెల్ఫోన్లను వాడవద్దని కచ్చితంగా నియమం పెట్టుకుంది గ్యాంగ్.
సెక్యూరీటీ లేని జ్యువెలరీ షాపును ఎంచుకుంది.

READ MORE: Irfan Pathan: షాహిద్‌ అఫ్రిదికి నోటి దూల ఎక్కువ.. నన్ను చూస్తే సైలెంట్ అవుతాడు!

ఖజానాలో వందల కోట్ల రూపాయల ఆభరణాలు ఉన్నట్లు ఈ గ్యాంగ్ గుర్తించింది. ఖజానా ను కొల్లగొడితే రూ.100 కోట్ల రూపాయల ఆభరణాలు చేతికి వస్తాయని భావించింది. దోచుకున్న ఆభరణాలను నాలుగు భాగాలు చేసుకున్న గ్యాంగ్ సభ్యులు పారిపోయారు. బీహార్లో ఐదువేల రూపాయల చొప్పున తుపాకుల కొనుగోలు చేశారు. దోపిడీ చేసే టైంలో అడ్డం వస్తే కాల్చి వేసేందుకు సిద్ధమయ్యారు. చివరకు పోలీసుల ఎట్టకేలకు పట్టుకున్నారు.

Exit mobile version