Site icon NTV Telugu

Khazana Jewellery: ఖజానా జ్యువెలరీలో దోపిడీ దొంగల బీభత్సం.. సిబ్బందిపై కాల్పులు!

Chanda Nagar Khazana Jewellery

Chanda Nagar Khazana Jewellery

Robbery attempt at Khazana Jewellers in Chandanagar: హైదరాబాద్‌ నగరంలోని చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ప్రముఖ నగల దుకాణం ‘ఖజానా జ్యువెలర్స్’లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. దొంగతనంను అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా.. కాల్పులు కూడా జరిపారు. దుండగుల కాల్పుల్లో షాపులోని పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. పోలీసుల రంగప్రవేశంతో దుండగులు షాప్‌లో నుంచి తప్పించుకుపోయారు. కేసు నమోదు చేసిన చందానగర్‌ పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Also Read: Warangal Rains: వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం.. 92.9 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం!

దుండగులు ముందుగా ఖజానా జ్యువెలర్స్ గేట్ సిబ్బందిని గాయపరిచి లోపలికి ఎంటర్ అయ్యారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపారు. మరికొందరిపై దాడులకు సైతం పాల్పడ్డారు. లాకర్ కీ ఇవ్వకపోవడంతో గన్ తీసుకొని బెదిరించారు. దుండగుల ముఠా అసిస్టెంట్ మేనేజర్‌పై కాల్పులు జరిపింది. షాప్‌ లోపల బంగారు ఆభరణాలకు సంబందించిన స్టాల్స్ పగలగొట్టారు. స్టాఫ్ సిబ్బంది ఒకరు పోలీసులకు కాల్ చేయగా.. వెంటనే వారు ఖజానా జ్యువెలర్స్ షాప్‌కు చేరుకున్నారు. పోలీసులను చూసి దొంగల ముఠా పారిపోయింది.

దుండగులు రెండు రౌండ్ల ఫైరింగ్‌ జరిపారు. తుపాకీతో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గ్యాంగ్‌లో మొత్తం 6 మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. దుండగుల కోసం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో చందానగర్‌లో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.

Exit mobile version