Bank Scam: ఏం తెలివిరా నాయనా.. బ్యాంక్‌నే బురిడీ కొట్టించారుగా..
- బ్యాంక్ ఉద్యోగితో కలిసి పన్నాగం..
- నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణం..
- వేలం వేసే క్రమంలో వెలుగులోకి మోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా ఏన్కూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) లో జరిగిన భారీ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కంచే చేను మేసిన చందంగా.. తాకట్టు పెట్టే బంగారాన్ని పరీక్షించి ధ్రువీకరించాల్సిన గోల్డ్ అప్రైజరే స్వయంగా నకిలీ నగలతో బ్యాంకును బురిడీ కొట్టించాడు.
కుట్ర ఎలా సాగిందంటే..?
ఈ కేసుకు సంబంధించి ఏన్కూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపాది సతీష్ (A1) అనే వ్యక్తి ఈ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. తన హోదాను అడ్డం పెట్టుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కా పథకం వేశాడు. తన భార్య శ్రీపాది మౌనిక (A2), అత్త రామచంద్రోజు జయమ్మ (A3), బావమరిది రామచంద్రోజు నరేశ్ (A4) లతో కలిసి 2024లో విడతల వారీగా సుమారు 242.25 గ్రాముల నకిలీ ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టించాడు. సతీష్ స్వయంగా వాటిని అసలైన బంగారంగా సర్టిఫై చేయడంతో, బ్యాంక్ అధికారులు ఏమాత్రం అనుమానించకుండా నిందితులకు రూ. 9.53 లక్షల గోల్డ్ లోన్ మంజూరు చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మోసం బయటపడిందిలా..
రుణం తీసుకున్న నిందితులు గడువు ముగిసినా అసలు కానీ, వడ్డీ కానీ చెల్లించలేదు. దీంతో ఆ లోన్ అకౌంట్లు అన్నీ ఎన్పీఏ (NPA – నిరర్థక ఆస్తులు) గా మారిపోయాయి. బ్యాంకు నిబంధనల ప్రకారం బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు ఆ ఆభరణాలను వేలం వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వేలం ప్రక్రియలో భాగంగా ఇతర నిపుణులతో బంగారాన్ని పునఃపరిశీలించగా, అవి కేవలం బంగారు పూత పూసిన నకిలీ నగలుగా తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.
ముగ్గురి అరెస్ట్ ..
బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కేవీ ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, ఏన్కూరు ఎస్సై సంధ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురూ కలిసి పథకం ప్రకారం బ్యాంకును మోసం చేసినట్లు నిర్ధారించారు.
నిందితులైన సతీష్ (గోల్డ్ అప్రైజర్), జయమ్మ, నరేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సతీష్ భార్య మౌనిక (A2) ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినా.. నకిలీ పత్రాలు లేదా నకిలీ వస్తువులతో మోసాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..