Khalistan Commando Chief: పాకిస్థాన్‌లోని లాహోర్‌లోని జోహార్ టౌన్‌లో శనివారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని ముష్కరులు వాంటెడ్ టెర్రరిస్ట్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) అధిపతి పరమజిత్ సింగ్ పంజ్వార్ అలియాస్ మాలిక్ సర్దార్ సింగ్‌ను కాల్చి చంపారు. జోహార్ టౌన్‌లోని సన్‌ఫ్లవర్ సొసైటీలోని తన నివాసం సమీపంలో ఉదయం 6 గంటలకు మోటారుబైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పంజ్వార్, అతని గన్‌మెన్‌ను కాల్చి చంపేశారు. కాల్పుల్లో గాయపడిన మరో సాయుధుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Cable Bridge : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య
భారత పంజాబ్‌లోకి డ్రోన్‌లను ఉపయోగించి డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్‌లో పాల్గొన్న పరమ్‌జిత్.. పంజాబ్‌లోని తరణ్ తరణ్ సమీపంలోని పంజ్వార్ గ్రామంలో జన్మించాడు. అతను 1986లో తన బంధువు లభ్ సింగ్ ఆధ్వర్యంలో కేసీఎఫ్‌లో చేరాడు. అంతకు ముందు, అతను సోహల్‌లోని సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో పనిచేశాడు. 1990వ దశకంలో లబ్ సింగ్‌ను భారత భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత, పంజ్వార్ కేసీఎఫ్‌ను స్వాధీనం చేసుకుని పాకిస్తాన్‌కు పారిపోయాడు. భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పంజ్వార్, సరిహద్దు ఆయుధాల స్మగ్లింగ్, హెరాయిన్ ట్రాఫికింగ్ ద్వారా ఆర్థికంగా సంపాదించడం ద్వారా కేసీఎఫ్‌ని సజీవంగా ఉంచాడు. పాకిస్తాన్ తన భూభాగంలో తన ఉనికిని తిరస్కరించినప్పటికీ, పంజ్వార్ లాహోర్‌లోనే ఉన్నాడు. అతని భార్య, పిల్లలు జర్మనీకి వెళ్లారు.