Head Coach of Indian Men’s Football: భారత పురుషుల జాతీయ ఫుట్‌బాల్ జట్టు ప్రధాన కోచ్‌గా ఖలీద్ జమీల్ నియమితులయ్యారు. 13 సంవత్సరాల తరువాత కోచ్ స్థానం భారతీయుడికి లభించింది. ఈయన 2017లో ఐజ్వాల్ ఫుట్‌బాల్ క్లబ్‌ను చారిత్రాత్మక ఐ-లీగ్ టైటిల్‌కు జమీల్ నాయకత్వం వహించాడు. 48 ఏళ్ల ఖలీద్ జమీల్ మాజీ భారత అంతర్జాతీయ క్రీడాకారుడు. ప్రస్తుతం ఆయన ఇండియన్ సూపర్ లీగ్ (ISL) జట్టు జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ కోచ్‌గా ఉన్నారు. వాస్తవానికి.. ముగ్గురు పేర్లను ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించింది. జమీల్‌ను ఎంపిక చేసింది. మిగతా ఇద్దరు పోటీదారులలో భారత మాజీ ప్రధాన కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటైన్, స్లోవేకియా జాతీయ జట్టు మాజీ మేనేజర్ స్టీఫన్ టార్కోవిక్ ఉన్నారు. ప్రధాన కోచ్‌గా జమీల్ మొదటి సవాలు సెంట్రల్ ఆసియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (CAFA) నేషన్స్ కప్. ఇది ఆగస్టు 29 నుంచి తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతుంది. కాగా.. భారత పురుషుల జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేసిన చివరి భారతీయుడు సావియో మెడీరా, ఆయన 2011 నుంచి 2012 వరకు ఈ బాధ్యతను నిర్వర్తించారు.
READ MORE: Mahavatar Narasimha: మహావతార్ నరసింహ అరాచకం.. ఎన్ని కోట్లు కొల్లగొట్టారంటే ?
ఖలీద్ జమీల్ ఎవరు?
కువైట్‌లో జన్మించిన భారత మాజీ మిడ్‌ఫీల్డర్ ఖలీద్ జమీల్ కోచ్‌గా (2017లో ఐజ్వాల్ FC) భారతదేశపు అగ్రశ్రేణి ఫుట్‌బాల్ లీగ్‌ను గెలుచుకున్న కొద్దిమంది వ్యక్తులలో ఒకరు. అతను AFC ప్రో లైసెన్స్ కలిగి ఉన్నాడు. I-లీగ్, I-లీగ్ 2 నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ISL) వరకు భారత ఫుట్‌బాల్‌లోని ప్రతి స్థాయిలో జట్లకు శిక్షణ ఇచ్చాడు. 2023–24 సీజన్ మధ్యలో ఖలీద్ జమీల్ జంషెడ్‌పూర్ FC జట్టుకు బాధ్యతలు స్వీకరించి జట్టు ప్రదర్శనను పూర్తిగా మలుపు తిప్పాడు. అతను జట్టును సూపర్ కప్‌లో సెమీ-ఫైనల్స్‌కు, ఆపై రన్నరప్‌గా నిలిచేందుకు నడిపించడమే కాకుండా, ISL ప్లేఆఫ్స్‌లో కూడా స్థానం సంపాదించేల చేశాడు. అతని అద్భుతమైన ప్రదర్శన రెండేళ్ల కాంట్రాక్ట్ పొడిగింపును సంపాదించిపెట్టింది. ఇది ISLలో ఒక భారతీయ కోచ్‌కు లభించే అరుదైన ఘనత.
