Site icon NTV Telugu

Khaleja: హాలీవుడ్ రేంజ్ సినిమాను ప్లాప్ చేశారు కదరా..

Mahesh

Mahesh

Khaleja: కొన్ని సినిమాలు.. ప్లాప్ అయినా కూడా ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఖలేజా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో అతడు తరువాత వచ్చిన సినిమా ఖలేజా. ఈ చిత్రంలో మహేష్ సరసన అనుష్క నటించింది. 2010 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే.. మహేష్ కెరీర్ లో అల్టిమేట్ మూవీ అంటే ఖలేజా అనే చెప్పాలి. ఇందులో మహేష్ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ అని చెప్పాలి. కమెడియన్స్ సునీల్, ఆలీ ఉన్నా కూడా మహేష్ కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఇన్నాళ్ల తరువాత ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చింది అంటే.. తెలుగువారు పట్టించుకోకపోయినా.. ఈ ప్లాప్ సినిమాను హాలీవుడ్ పట్టించుకుంది. అవును.. కొలైడర్ అనే హాలీవుడ్ ఆన్ లైన్ పబ్లికేషన్.. టాప్ 10 క్రైమ్ అండ్ డ్రామా మూవీస్ లో ఖలేజాకు స్థానం ఇచ్చింది. టాప్ 10.. 7 వ ర్యాంక్ ఖలేజా సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Samantha: సామ్.. నువ్వెందుకని మార్వెల్ సిరీస్ లో నటించకూడదు

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక బిజినెస్ మ్యాన్ అత్యాశ వలన ఒక చిన్న గ్రామం నామరూపాలు లేకుండా పోతుంది. తమ గ్రామాన్ని కాపాడడానికి దేవుడు లాంటి ఒక మనిషి వస్తాడు అని ఆ గ్రామప్రజలు నమ్ముతారు. అలా హీరో.. దేవుడిలా మారి ఆ గ్రామాన్ని ఎలా కాపాడాడు అనేది కథ. ఇందులో త్రివిక్రమ్.. దేవుడు.. పైన ఉండడు .. ప్రతి మనిషిలో ఉంటాడు. పక్కవాడు ఆపదలో ఉన్నప్పుడు.. లోపలి నుంచి బయటికి వస్తాడు. మంచి మనస్సుతో వారికి సాయం చేయాలనీ తలపిస్తే.. ఏదనుకుంటే అది అయిపోతుందని చూపించాడు. ఇక ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వైరల్ గా మార్చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ సినిమాను ప్లాప్ చేశారు కదరా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version