తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ఎంపీల సమావేశం ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే… టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. ఈ నెల 25 న హైదరాబాద్‌లోని హైటెక్స్ లో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశం పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే… వచ్చే నెల 15 న వరంగల్‌లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ ఇతర అంశాల పై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ పార్టీ కీలక నేతలందరూ హాజరయ్యారు.
తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం
