NTV Telugu Site icon

Hyderabad Metro Expansion: హైదరాబాద్‌ మెట్రోపై కీలక నిర్ణయం.. అక్కడి వరకు మెట్రో సేవలు

Ktr

Ktr

Hyderabad Metro Expansion: తెలంగాణ కేబినెట్‌ హైదరాబాద్‌ మెట్రోపై మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో విస్తరణ సహా పలు కీలక అంశాలకు ఆమోదం వేశారు.. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు.. ప్రజా రవాణాను విస్తృతం చేయాలని భావిస్తున్నాం.. హైదరాబాద్ మెట్రో రైలును విస్తరిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు.. 70 కిలో మీటర్లకు అదనంగా ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ వే వస్తుందన్న ఆయన.. జూబ్లీ బస్టాండ్ నుంచి తుంకుంటా… డబుల్ డెక్కర్ మెట్రో, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు, ఇస్సాన్పూర్ – మియాపూర్, ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు… శంషాబాద్ నుంచి కొత్తూరు వరకు విస్తరణ చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. ఇక, ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ మెట్రో వరకు విస్తరణ చేయాలని నిర్ణయించాం.. 60 వేల కోట్ల రూపాయలతో 101 కిలోమీటర్లకు అదనంగా మెట్రో కారిడార్‌ నిర్మాణం చేస్తాం అన్నారు.. రాబోయే మూడు, నాలుగేళ్ళలో మెట్రోరైలు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇక, దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం.. వారు సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌.

Read Also: TSRTC: కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం..!

ఇక, వరద నష్టంపై కేబినెట్‌లో చర్చ జరిగింది.. తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రోడ్లకు తక్షణం మరమ్మతులు చేస్తాం.. విద్యుత్ వీరులకు 15 ఆగస్టున సత్కారం చేస్తామని ప్రకటించారు.. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి తీర్మానం చేసి పంపుతామన్న ఆయన.. రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదన్నారు.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎస్టీల నుంచి కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రావణ్‌లను గవర్నర్ కు ప్రతిపాదిస్తూ కేబినెట్‌ తీర్మానం చేసిందన్నారు. వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టుకు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపాలని నిర్ణయం తీసుకున్నాంమ.. హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్టు అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్.

Show comments