Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయవల్లే ఈరోజు బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. ఈ విషయంలో కార్యకర్తల కష్టార్జితం మరువలేనిదన్నారు. కార్యకర్తలతోపాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ వచ్చిన బండి సంజయ్ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తదితరులతో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read also: Realme GT 6 Price: ‘రియల్‌మీ’ సరికొత్త ఫోన్.. 10 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్!
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ అమ్మవారు చాలా పవర్ ఫుల్ అన్నారు. అమ్మవారి దయవల్లే ఆనాడు ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందన్నారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందంటే అమ్మవారి దయే. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తాం. మేం తెలంగాణలో గెలిచామంటే బీజేపీ కార్యకర్తల త్యాగాలే కారణమని, వారి కష్టార్జితమే అన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు. సామాన్య కార్యకర్తలమైన కిషన్ రెడ్డిని ఇవాళ కేంద్ర మంత్రులుగా ఉన్నామంటే.. బీజేపీ వల్లే సాధ్యమైందన్నారు. కార్పొరేటర్ కేంద్ర మంత్రి కావొచ్చని, చాయ్ వాలా ప్రధాని కావొచ్చని.. నిరూపించిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన బీజేపీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేదాకా పోరాడతా అన్నారు. నా చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ కోసమే ధారపోస్తా అన్నారు.
Indigo : ఇండిగో విమానంలో గందరగోళం.. ఏడ్చేసిన ప్రయాణికులు.. 30నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు