NTV Telugu Site icon

PM Modi: స్పీకర్ ఓం బిర్లాపై ప్రధాని మోడీ ప్రశంసలు..

Pm Modi

Pm Modi

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ పదవికి ప్రధాని నరేంద్ర మోడీ తన పేరును ప్రతిపాదించారు. ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య పార్టీలు ఆయన పేరుకు మద్దతు పలికాయి. ఆ తర్వాత.. వాయిస్ ఓటు ద్వారా ఈ పదవికి ఎంపికయ్యారు. మరోవైపు.. కాంగ్రెస్ తరుఫు నుంచి ఎంపి కె. సురేష్‌ను లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకునే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా.. ముజువాణీ ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో.. వరుసగా రెండోసారి స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో.. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టారు.

Parliament: లోక్‌సభలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్..

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధాని బిర్లాపై ప్రశంసలు కురిపించారు. సభ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉండేలా చూడడంలో బిర్లా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్ల పాటు మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నానని మోడీ తెలిపారు. మీ మధురమైన చిరునవ్వు సభ మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుందని ప్రశంసల జల్లు కురిపించారు. మీరు రెండవసారి స్పీకర్ పదవికి ఎన్నిక కావడం గౌరవప్రదమైన విషయం అని బిర్లాను అభినందించారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో జరగని పనులు మీ అధ్యక్షతన ఈ సభ వల్లే సాధ్యమయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. కీలక బిల్లులు మీ నాయకత్వంలో ఆమోదం పొందాయని.. ప్రజాస్వామ్య సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్లు వచ్చాయని తెలిపారు. 17వ లోక్‌సభ సాధించిన విజయాల గురించి దేశం గర్విస్తుందని తనకు చాలా నమ్మకం ఉందని స్పీకర్ ఓం బిర్లాపై పొగడ్తలతో ముంచెత్తారు.

IND vs ENG Semi Final: భారత్, ఇంగ్లండ్ సెమీస్‌కు ‘నో రిజర్వ్‌ డే’.. కారణం ఏంటంటే?

మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు ప్రభుత్వం సహకరించాలన్నారు. ప్రభుత్వానికి ఎక్కువ రాజకీయ అధికారం ఉంది.. అలాగే ప్రతిపక్షం కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని సూచించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును అణచివేయడం అప్రజాస్వామికం.. ప్రతిపక్షం ప్రభుత్వానికి పూర్తిగా సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల వాణి ఎంతవరకు వినిపిస్తుందో ఈ సభలో స్పీకర్ నిర్ణయిస్తారని, అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దేశ ప్రజలు కట్టుబడి ఉన్నారని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. ప్రజల మద్దతుతో మేము పార్లమెంటులో పూర్తిగా ప్రాతినిధ్యం వహిస్తామని.. వారి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి పోరాడుతూనే ఉంటామని రాహుల్ గాంధీ చెప్పారు.