Site icon NTV Telugu

Kesamudram: అర్ధరాత్రి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం!

Kesamudram

Kesamudram

Kesamudram: కేసముద్రం రైల్వే స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లో నిలిపివేసిన ఓ రెస్ట్ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదం సంభవించిన సమయంలో కోచ్‌లో నలుగురు ఉద్యోగులు ఉన్నారు. వారు చాకచక్యంగా స్పందించి వెంటనే కంపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుట బండి సంజయ్ హాజరు!

అయితే, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు అధికారులు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రైల్వే స్టేషన్‌కు చేరుకుని రెస్ట్ కోచ్‌లోని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ప్రమాద సమయంలో రెస్ట్ కోచ్ నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొనడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

Horoscope Today: శుక్రవారం దినఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!

Exit mobile version