Physical Harassment: దేశంలో నిత్యం ఏదో మూలన ఆడవాళ్లపై అత్యాచారాలు, హింస కొనసాగుతూనే ఉంది. రోడ్లు, బస్సులతో పాటు ఇప్పుడు ఆసుపత్రుల్లో కూడా మహిళలకు భద్రత లేదు. కన్నూర్ జిల్లాలో చికిత్స పొందుతున్న ఓ మహిళపై ఓ నర్సింగ్ అసిస్టెంట్ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూన్ 25న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కన్నూర్ జిల్లాలోని ప్రభుత్వ తాలూకా ఆసుపత్రిలో రోగిని వేధించినందుకు 47 ఏళ్ల నర్సింగ్ అసిస్టెంట్‌ను అరెస్టు చేశారు.
Also Read: Amit Malviya: రాహుల్ గాంధీపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్లు.. కేసు నమోదు
నిందితుడిని మనఠానకు చెందిన డేనియల్‌గా గుర్తించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన కూతుపరంబలోని ప్రభుత్వ తాలూకా ఆసుపత్రిలో జరిగింది. ఫిర్యాదు చేసిన మహిళ చికిత్స కోసం వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె గాయాలకు డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఆమెను వేధించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఆమెతో అసభ్యకరంగా మాట్లాడి అనుచితంగా తాకినట్లు మహిళ ఆరోపించింది. ఆమె రాష్ట్ర ఆధ్వర్యంలో నడిచే హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు మరుసటి రోజు అతన్ని అరెస్టు చేశారు.