Site icon NTV Telugu

Kuwait fire: ఇంటర్ పాసైన కుమార్తెకు ఫోన్ కొనుగోలు.. అంతలోనే ఘోరం

Idie

Idie

కువైట్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఆప్తుల్ని కోల్పోయిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనాస్థలిలోనే కార్మికులు ఖాళీ బుడిదైపోయారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో 49 మంది చనిపోతే.. అందులో 42 మంది భారతీయులే ఉన్నారు. ఎక్కువ మంది కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన భారతీయులు ఉన్నారని కువైట్ మీడియా తెలిపింది. నిర్మాణ సంస్థ ఎన్‌బీటీసీ గ్రూప్‌కు చెందిన 195 మంది కార్మికుల బస కోసం భవనాన్ని అద్దెకు తీసుకుని పెట్టారు.

ఇదిలా ఉంటే అగ్నిప్రమాదంలో చనిపోయిన కేరళ వ్యక్తి లూకోస్‌కు సంబంధించిన బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ పాసైన కుమార్తెకు ఇటీవలే ఫోన్‌ను బహుమతిగా కొనుగోలు చేశాడు. వచ్చే నెలలో బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. కానీ ఇంతలోనే విషాదకరమైన వార్త అందింది. ఇటీవలే ప్లస్ టూ (12వ తరగతి) బోర్డ్ ఎగ్జామ్స్‌లో లూకోస్‌ పెద్ద కుమార్తె అద్భుతమైన మార్కులు సాధించింది. కుమార్తె కోసం మొబైల్ ఫోన్ కొన్నాడు. అలాగే బెంగళూరులో నర్సింగ్ కోర్సులో అడ్మిషన్ కోసం ఇంటికి రావాలని అనుకున్నాడు. వచ్చే నెలలో కేరళ రావాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో కుటుంబ సభ్యులకు అధికారుల నుంచి చావు కబురు అందించారు. కువైట్ అగ్నిప్రమాదంలో చనిపోయినట్లుగా సమాచారం ఇచ్చారు. లూకోస్ స్నేహితులు.. ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేశారని అతని బంధువుల్లో ఒకరు మీడియాకు తెలిపాడు.

‘‘అగ్ని ప్రమాదం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిందని వారు మాకు చెప్పారు. ఆ సమయంలో లూకోస్ అక్కడ ఉన్న చర్చి పాస్టర్‌కి కాల్ చేశాడు. కాల్ డిస్‌కనెక్ట్ కాకముందే అతను పాస్టర్‌తో కొద్దిసేపు మాట్లాడాడు. అతని ఫోన్‌కు తిరిగి కాల్ చేసినప్పుడు, అది రింగ్ అవుతోంది. కానీ ఎవరూ తీయలేదు’’. అని అతను చెప్పాడు. ఆ సమయంలో అతను బతికే ఉన్నాడని అందరూ అనుకున్నారని బంధువు చెప్పాడు. తర్వాత స్నేహితులు మరియు చర్చి సభ్యులు లూకోస్ నివసిస్తున్న భవనం దగ్గరకు.. సమీపంలోని ఆసుపత్రుల్లో విచారించగా మంటల్లో చిక్కుకున్న వారిలో అతను కూడా ఉన్నాడని తెలిసిందన్నారు. ఇదిలా ఉంటే లూకోస్ మరణాన్ని తొలుత ధృవీకరించలేదని… సాయంత్రం స్నేహితులు, చర్చి సభ్యులు పోలీసుల దగ్గరకు వెళ్లి విచారించగా.. అతని మరణం ధృవీకరించారని బంధువు చెప్పాడు. గత 18 సంవత్సరాలుగా కువైట్‌లో పనిచేస్తున్న లూకోస్‌కు తండ్రి (93), 88 ఏళ్ల తల్లి, భార్య మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని బంధువు తెలిపాడు.

లూకోస్ పెద్ద కూతురు ప్లస్ 2 లో అద్భుతమైన మార్కులు సాధించింది. ఆమె కోసం ఒక ఫోన్ కొన్నాడని తెలిపాడు. వచ్చే నెలలో వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పాడన్నారు. అలాగే ఆమెను నర్సింగ్ కోర్సులో అడ్మిషన్ కోసం బెంగళూరుకు తీసుకెళ్ళబోతున్నాడని బంధువు వివరించాడు.

దక్షిణ నగరమైన మంగాఫ్‌లో 196 మంది వలస కార్మికులు నివసిస్తున్న ఏడు అంతస్తుల భవనంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 49 మంది కార్మికులు మరణించారు. 50 మంది గాయపడ్డారు. అత్యధిక మరణాలు పొగ పీల్చడం వల్లనే సంభవించాయని.. వంటగదిలో మంటలు చెలరేగాయని కువైట్ మీడియా తెలిపింది.

Exit mobile version