NTV Telugu Site icon

Kerala Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఆ ఛానళ్లు ఉండొద్దు

Youtube

Youtube

Kerala Government: ప్రస్తుతం ఇంటర్నెట్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ పరిచయం ఉంటుంది. షార్ట్ వీడియోలు వచ్చాక ప్రతి ఒక్కరూ ఏదో ఒక వీడియో తీసి యూట్యూబ్‎లో అప్ లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా సొంతంగా తమకంటూ ఓ ఛానల్ క్రియేట్ చేసి ప్రమోట్ చేసుకుంటున్నారు. చేస్తున్న ఉద్యోగానికి.. పార్ట్ టైంలా యూట్యూట్ ఛానళ్ల ద్వారా అదనంగా సంపాదిస్తున్నారు. ఒక్కో సారి తమ ఛానళ్ల పై ఫోకస్ పెట్టి చేస్తున్న ఉద్యోగంపై దృష్టి పెట్టడం లేకపోతున్నారు. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. విధులు నిర్వహించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్‌ ఛానల్‌ను నడపరాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అలాచేస్తే కేరళ ప్రభుత్వ ఉద్యోగుల నియమావళి 1960 ప్రకారం ఉల్లంఘనే అవుతుందని తేల్చి చెప్పింది.

Read Also: Cruel Woman: ప్రియుడి సాయంతో భర్త, అత్తను ముక్కలుగా నరికింది.. కవర్లో పెట్టి కాల్వలో వేసింది

ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా యుట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాంట్ ఫాంలలో వీడియోలను పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమంది. ఈ మేరకు కార్మిక, నైపుణ్యాల శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆర్ఎస్ రూసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛ ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించడానికి అనుమతించినప్పటికీ.. వారు నిర్ధిష్ట సంఖ్యలో సబ్ స్క్రైబర్లను కలిగి ఉండాలని, యూట్యూబ్ ఛానెల్ నుండి ఆర్థికంగా ప్రయోజనం పొందడానికి అనుమతించబడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read Also: MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలకు.. వైసీపీ అభ్యర్థులు వీరే

అయితే, ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ నడుపుతున్న ప్రభుత్వ ఉధ్యోగులు తమ ఛానెల్స్ ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఒక్కరూ ఇకపై యూట్యూబ్ ఛానల్స్ ను నిర్వహించవద్దని, ఉద్యోగులు అలా చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని జీవోలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. యూట్యూబ్ చానల్ నిర్వహణకు అనుమతి కోరుతూ అగ్నిమాపక సిబ్బంది చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ చానళ్లను మూసివేయాలని ఆ జీవోలో కోరింది.