Kerala: రాష్ట్రపతి, గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఆరిఫ్ తీరును కేరళ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మేరకు వారి ప్రవర్తనపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏడు బిల్లులను ఎలాంటి కారణం లేకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచారని, అనంతరం రాష్ట్రపతి కూడా అదే విధంగా వ్యవహరించారని.. దీంతో శాసనసభ ప్రయోజనం మరియు పనితీరు అసమర్థంగా మారిందని కేరళ ప్రభుత్వం పేర్కొంది. దీంతో కేరళ సర్కార్ అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రాష్ట్రపతి దగ్గర నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఎలాంటి కారణం చెప్పకుండానే వాటిని పక్కన పెట్టేశారని పినరయి సర్కార్ ఆ పిటిషన్లో పేర్కొంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెక్రటరీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆయన అదనపు కార్యదర్శి పేర్లను కూడా సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేర్చింది.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తన దగ్గర ఏడు బిల్లులు పెండింగ్‌లో పెట్టుకున్నారని.. అందులో నాలుగు బిల్లులు చాలా జాప్యం తర్వాత రాష్ట్రపతికి పంపగా.. అక్కడ కూడా పెండింగ్‌లో ఉండిపోయాయని పిటిషన్లో వివరించింది. ఇలా అసాధారణ జాప్యం చోటుచేసుకోవడం చట్టం ముందు అందరూ సమానమనే రాజ్యాంగంలోని సెక్షన్ 14ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. రాజ్యాంగంలోని 22 సెక్షన్ ప్రకారం కేరళ రాష్ట్ర ప్రజలకు అందాల్సిన సంక్షేమం అందకుండా చేసినట్టు అవుతుందని పిటిషన్లో సర్కార్ పేర్కొంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!