Kerala Court: కేరళలో సంచలనం సృష్టించిన బాయ్‌ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గత వారం యువతి గ్రీష్మని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం ఆ మేరకు ఉరి శిక్షను ఖరారు చేసింది. అలాగే, ఆమెకు సహకరించిన బంధువులకు మూడేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ ఈరోజు ( జనవరి 20) నెయ్యట్టింకర అదనపు సెషన్స్ న్యాయస్థానం జడ్జి ఏఎం బషీరిన్ తీర్పు వెల్లడించారు. అయితు, ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న గ్రీష్మ తల్లిని సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వదిలేసింది కోర్టు.
అయితే, ఈ కేసులో కేళర పోలీసులు వేగంగా దర్యాప్తు చేసినందుకు న్యాయస్థానం ప్రశంశించింది. ఇది అరుదైన కేసు.. అందువల్ల ఆమె వయస్సును పరిగణనలోకి తీసుకోలేమని కోర్టు పేర్కొనింది. తీర్పు విన్న తర్వాత గ్రీష్మా ఎలాంటి రియాక్షన్ లేకుండా న్యాయస్థానంలో నిలబడినట్లు అక్కడి మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. కాగా, షారన్, గ్రీష్మా చాలా ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. ఇక, గ్రీష్మ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది.. దాంతో ఆ షారోన్‌తో ఆ విషయం చెప్పింది.. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో హత్యకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే అతడికి హెర్బల్ మెడిసిన్ ఇచ్చి చంపేసింది. కాగా, షారన్ వైద్య రికార్డులతో పాటు గ్రీష్మాతో చేసిన చాట్‌ల డిజిటల్ సాక్ష్యంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా గ్రీష్మ ఉంది.