Viral Video: బుసలు కొడుతున్న 18 అడుగుల కింగ్ కోబ్రా.. ఈజీగా పట్టేసిన లేడీ ఆఫీసర్!
- నివాస ప్రాంతాల మధ్యలో 18 అడుగుల కింగ్ కోబ్రా
- అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
- ఈజీగా పట్టేసిన లేడీ బీట్ ఆఫీసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఓ చిన్న పాము కన్పిస్తేనే మనం ఆమడ దూరం పరుగెత్తుతాము. నాగుపాము కనిపిస్తే.. భయంతో వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి లగెత్తుతాము. ఇక ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ‘కింగ్ కోబ్రా’ ఎదురుపడితే.. ఇంకేమన్నా ఉందా, పై ప్రాణాలు పైనే పోతాయ్. అలాంటి కింగ్ కోబ్రాను ఓ లేడీ ఆఫీసర్ చాలా ఈజీగా పట్టేశారు. అడుగు దూరంలో ఉన్నా, బుసలు కొడుతున్నా ఎలాంటి భయం లేకుండా పట్టుకున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
తిరువనంతపురంలోని పెప్పరలో నివాస ప్రాంతాల మధ్య ఉన్న కాలువలో 18 అడుగుల కింగ్ కోబ్రా స్థానికులకు కనిపించింది. భారీ కింగ్ కోబ్రాను చూసి జనాలు భయపడిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పరుత్తిపల్లి ఫారెస్ట్ రేంజ్‌కు చెందిన మహిళా అధికారిణి రోషిణి అక్కడికి చేరుకున్నారు. స్నేక్ స్టిక్ సాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కింగ్ కోబ్రా ఓసారి మీదికి దూసుకొచ్చింది. అయినా కూడా లేడీ ఆఫీసర్ రోషిణి జంకలేదు. కింగ్ కోబ్రా నీటిలో పారిపోతుండగా.. తోకను పట్టుకుని అదుపు చేశారు. కొంత సమయం శ్రమించిన అనంతరం చాకచక్యంగా సంచిలో బంధించారు.
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
Also Read: Akash Deep: ఇలాంటి సోదరుడు ఉండటం నా అదృష్టం.. ఆకాశ్ దీప్ అక్క ఎమోషనల్!
18 అడుగుల కింగ్ కోబ్రాను లేడీ ఆఫీసర్ రోషిణి పడుతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన వారు లేడీ ఆఫీసర్ రోషిణిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘హ్యాట్సాఫ్ రోషిణి మేడమ్’, ‘రోషిణి మేడమ్ సూపర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేడీ ఆఫీసర్ రోషిణి గతంలోనూ పెద్ద పెద్ద కింగ్ కోబ్రాలను పట్టినట్లు స్థానికులు చెప్పుతున్నారు.
கேரளா – திருவனந்தபுரம் ; குடியிருப்புப் பகுதியில் அருகில் உள்ள ஓடையில் பதுங்கியிருந்த 18 அடி நீளமுள்ள ராஜநாகத்தை
பருத்திப்பள்ளி ரேஞ்சின் வனப் பிரிவு பெண் அதிகாரி ரோஷ்னி அசால்டாக பிடித்த காட்சி. pic.twitter.com/wW0ey8dlmZ
— Kᴀʙᴇᴇʀ – தக்கலை கபீர் (@Autokabeer) July 7, 2025
తాజావార్తలు
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్‌లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!