Site icon NTV Telugu

Viral Video: బుసలు కొడుతున్న 18 అడుగుల కింగ్ కోబ్రా.. ఈజీగా పట్టేసిన లేడీ ఆఫీసర్‌!

King Cobra Viral Video

King Cobra Viral Video

సాధారణంగా ఓ చిన్న పాము కన్పిస్తేనే మనం ఆమడ దూరం పరుగెత్తుతాము. నాగుపాము కనిపిస్తే.. భయంతో వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి లగెత్తుతాము. ఇక ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ‘కింగ్ కోబ్రా’ ఎదురుపడితే.. ఇంకేమన్నా ఉందా, పై ప్రాణాలు పైనే పోతాయ్‌. అలాంటి కింగ్ కోబ్రాను ఓ లేడీ ఆఫీసర్‌ చాలా ఈజీగా పట్టేశారు. అడుగు దూరంలో ఉన్నా, బుసలు కొడుతున్నా ఎలాంటి భయం లేకుండా పట్టుకున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.

తిరువనంతపురంలోని పెప్పరలో నివాస ప్రాంతాల మధ్య ఉన్న కాలువలో 18 అడుగుల కింగ్ కోబ్రా స్థానికులకు కనిపించింది. భారీ కింగ్ కోబ్రాను చూసి జనాలు భయపడిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పరుత్తిపల్లి ఫారెస్ట్ రేంజ్‌కు చెందిన మహిళా అధికారిణి రోషిణి అక్కడికి చేరుకున్నారు. స్నేక్ స్టిక్ సాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కింగ్ కోబ్రా ఓసారి మీదికి దూసుకొచ్చింది. అయినా కూడా లేడీ ఆఫీసర్‌ రోషిణి జంకలేదు. కింగ్ కోబ్రా నీటిలో పారిపోతుండగా.. తోకను పట్టుకుని అదుపు చేశారు. కొంత సమయం శ్రమించిన అనంతరం చాకచక్యంగా సంచిలో బంధించారు.

Also Read: Akash Deep: ఇలాంటి సోదరుడు ఉండటం నా అదృష్టం.. ఆకాశ్‌ దీప్ అక్క ఎమోషనల్!

18 అడుగుల కింగ్‌ కోబ్రాను లేడీ ఆఫీసర్‌ రోషిణి పడుతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది. వీడియో చూసిన వారు లేడీ ఆఫీసర్‌ రోషిణిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘హ్యాట్సాఫ్ రోషిణి మేడమ్’, ‘రోషిణి మేడమ్ సూపర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేడీ ఆఫీసర్‌ రోషిణి గతంలోనూ పెద్ద పెద్ద కింగ్‌ కోబ్రాలను పట్టినట్లు స్థానికులు చెప్పుతున్నారు.

Exit mobile version