Site icon NTV Telugu

Bus Accident: అంత్యక్రియల నుండి వస్తూ ఘోర ప్రమాదం.. 25 ప్రాణాలు బలి!

Bus Accident

Bus Accident

Bus Accident: అంత్యక్రియల నుండి తిరిగి వస్తున్న బస్సు అదుపు తప్పి కెన్యాలో రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో 25 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ బస్సు కాకమేగా పట్టణం నుండి కిసుము పట్టణంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. న్యాంజా ప్రావిన్స్‌లోని ప్రాంతీయ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పీటర్ మైనా తెలిపిన ప్రకారం.. రౌండ్ అబౌట్ వద్ద అధిక వేగంతో వస్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది రోడ్డుపక్కకు వంపు తిరిగి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో మృతుల్లో 10 మంది మహిళలు, 10 మంది పురుషులు, మాగితావారు పిల్లలు ఉన్నారని తెలిపారు.

Happy Birthday Mahesh Babu: ఒక్క పాన్ ఇండియా సినిమా లేదు కానీ.. రికార్డులు తిరగరాసిన మహేష్ బాబు

ఈ ప్రమాదంలో 29 మంది గాయపడ్డారని, వారిలో నలుగురు తర్వాత ఆసుపత్రిలో మరణించారని కెన్యా వైద్య సేవల ప్రిన్సిపల్ సెక్రటరీ ఫ్రెడ్రిక్ ఓమా ఒలుగా చెప్పారు ఈ ఘటన ప్రాంతాన్ని షాక్‌కు గురిచేసింది. రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని అక్కడి వారు అధికారులను కోరుతున్నారు. లోకల్ మీడియా తెలిపిన ప్రకారం, ప్రమాదం జరిగిన ప్రాంతంలో తరుచుగా ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని పేర్కొంది. ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోగా, దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

HBD Mahesh Babu: ఏంటి భయ్యా నిజమేనా.. మన సూపర్ స్టార్ మహేష్ కు 50 ఏళ్లా?

Exit mobile version