ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నాడు పంజాబ్ ప్రజలకు రాష్ట్రంలోని మొత్తం 13 సీట్లను ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అప్పుడే రాష్ట్రం విషయాలు లోక్‌సభలో ప్రతిధ్వనిస్తాయని ఆయన మాట్లాడారు. ఇకపోతే పంజాబ్ లోని మొత్తం 13 పార్లమెంట్ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి.
Viral video: బ్రిటీష్ పర్యాటకులపై బౌన్సర్ల దాడి.. పలువురికి గాయాలు
లూథియానా నగరంలో పార్టీ ఆప్ అభ్యర్థి అశోక్ పరాశర్ పప్పి కోసం ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్ మాట్లాడుతూ., ఏడాది క్రితం తాను, అతని పంజాబ్ కౌంటర్ భగవంత్ మాన్ అమృత్‌సర్, జలంధర్, లూథియానా, మొహాలీలోని వ్యాపారులతో అనేక సమావేశాలు నిర్వహించారని చెప్పారు. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు పంజాబ్ లో వ్యాపార, పరిశ్రమల పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలుపుతూ., పరిశ్రమలు పంజాబ్ ను వదిలి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్తున్నాయని ఆయన అన్నారు.
Kerala Express: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. కదులుతున్న రైలు ముందు దూకేసిన అమ్మాయి..
గత రెండేళ్లలో., పరిశ్రమలు పంజాబ్‌ను విడిచిపెట్టే ధోరణి ఆగిపోయిందని., పంజాబ్‌కు కొత్త పరిశ్రమలు వస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. మన ప్రభుత్వ హయాంలో పంజాబ్ కు రూ.56,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. విదేశీ కంపెనీలు కూడా ఇప్పుడు ఇక్కడ పరిశ్రమల కోసం భూములు కొనుగోలు చేస్తున్నాయి. జంషెడ్‌పూర్ తర్వాత, టాటా స్టీల్ యొక్క అతిపెద్ద ప్లాంట్ ఇప్పుడు పంజాబ్ లో ఏర్పాటు చేయబడుతోందని కేజ్రీవాల్ తెలిపారు.
